Adbutham Trailer: ఆకట్టుకుంటున్న అద్భుతం ట్రైలర్.. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..
థియేటర్లు తెరుచుకున్న.. ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు.. ఓ వైపు థియేటర్లలో సరికొత్త కంటెంట్ చిత్రాలతోపాటు.. వెబ్ సిరీస్లను
థియేటర్లు తెరుచుకున్న.. ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు.. ఓ వైపు థియేటర్లలో సరికొత్త కంటెంట్ చిత్రాలతోపాటు.. వెబ్ సిరీస్లను ప్రేక్షకులను అలరిస్తున్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ సినిమాను అందిస్తుంది ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్. యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అద్భుతం. ఇందులో హీరో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ హీరోయిన్గా నటిస్తుంది.
మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తునన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.. ప్రముఖ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో నవంబర్ 19న స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఈ సందర్భంగా.. అద్భుతం మూవీ ట్రైలర్ను విడుదల చేసింది చిత్రయూనిట్. హీరో ఫోన్ నంబర్.. హీరోయిన్ ఫోన్ నంబర్ ఒకటే కావడం.. అదే వాళ్ల పరిచయానికి కారణం కావడం.. అనే అంశాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఇందులో అద్భుతం ఏముంది ? అనే సందేహాన్ని కలిగిస్తూనే.. చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు డైరెక్టర్. హీరోకి హీరోయిన్ కనిపించదు.. బెంచ్ పై ఆమె రాస్తున్న అక్షరాలు మాత్రమే కనిపిస్తుంటాయి. ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలా మనం అనుకునేలోగానే.. హీరోతోనే ఆ మాట అనిపించేశారు. ఈ సినిమాకు ప్రశాంత వర్మ కథను అందించగా.. మాటలను లక్ష్మీ భూపాల్ అందించారు.
ట్రైలర్..
Also Read: Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్బాస్లో నా సపోర్ట్ అతనికే.. సోనూసూద్ వీడియో వైరల్..
Samantha: గాయాల నుంచి ఉపశమనం పొందే మార్గం.. ఇక జరిగింది చాలు.. సమంత ఆసక్తికర పోస్ట్..
Shanvi Meghana: ఆ స్టార్ డైరెక్టర్ నన్ను తమన్నా సిస్టర్ లా ఉంది అన్నారు : శాన్వి మేఘన