Shanvi Meghana: ఆ స్టార్ డైరెక్టర్ నన్ను తమన్నా సిస్టర్ లా ఉంది అన్నారు : శాన్వి మేఘన

"బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్", "పిట్ట కథలు", "సైరా నరసింహారెడ్డి", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శాన్వి మేఘన.

Shanvi Meghana: ఆ స్టార్ డైరెక్టర్ నన్ను తమన్నా సిస్టర్ లా ఉంది అన్నారు : శాన్వి మేఘన
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Nov 10, 2021 | 6:41 AM

Shanvi Meghana: “బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్”, “పిట్ట కథలు”, “సైరా నరసింహారెడ్డి”, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శాన్వి మేఘన. ఆమె హీరోయిన్ గా నటిస్తున్న కొత్త సినిమా “పుష్పక విమానం”. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రంలో షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ క్యారెక్టర్ లో మెప్పిస్తానంటోంది శాన్వి. “పుష్పక విమానం” చిత్రాన్ని దామోదర దర్శకత్వంలో ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలుగా వ్యవహరించారు. నవంబర్ 12న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతోంది “పుష్పక విమానం”. ఈ నేపథ్యంలో తన కెరీర్ సంగతులతో పాటు సినిమా విశేషాలను తెలిపింది శాన్వి మేఘన. ఆమె మాట్లాడుతూ.. ” నేను హైదరాబాద్ అమ్మాయిని. కాలేజ్ లో ఉండగా మా క్యాంపస్ లో కొన్ని సినిమాల షూటింగ్స్ జరుగుతుండేవి. అక్కడ నన్ను చూసి, ఓ సీరియల్ ఆడిషన్ కోసం పిలిచారు. మా ఇంట్లో వాళ్లకు నేను సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు. నాకు కూడా నటన అంటే అంత ఇంట్రస్ట్ ఉండేది కాదు. ఒకసారి జయసుధ గారు తన టీవీ ప్రోగ్రాంలో అవకాశం ఇవ్వడం కోసం మా ఇంట్లో వాళ్లతో మాట్లాడారు. అంత పెద్ద నటి పిలిచి అవకాశం ఇస్తుంది కాబట్టి మా అమ్మా నాన్న అభ్యంతరం చెప్పలేదు. జయసుధ గారు ఆ టీవీ ప్రోగ్రాంకి నిర్మాత. కానీ అనుకోని కారణాల రెండు ఎపిసోడ్స్ షూట్ చేసిన తర్వాత ఆ టీవీ కార్యక్రమం ఆగిపోయింది. ఆతర్వాత  ఇంతలో బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ అనే చిత్రంలో నాయికగా అవకాశం వచ్చింది. ఆ సినిమా అయ్యాక మెగాస్టార్ సైరా నరసింహా రెడ్డి లో ఓ చిన్న క్యారెక్టర్ ప్లే చేశాను. సైరా షూటింగ్ టైమ్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి నన్ను తమన్నా చెల్లిలా ఉంది ఆడిషన్ వద్దు అన్నారు. ఆ మాట పెద్ద కాంప్లిమెంట్ లా ఫీలయ్యా. “పుష్పక విమానం” చిత్రంలో నేను షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ క్యారెక్టర్ లో కనిపిస్తాను. చాలా బబ్లీ రోల్ ఇది. ఈ క్యారెక్టర్ లో మిమ్మల్ని ఆకట్టుకుంటాను. ఈ సినిమాలో హీరో ఆనంద్, గీత్ సైని, నా క్యారెక్టర్స్ ఎక్కడా రెగ్యులర్ హీరో హీరోయిన్స్ క్యారెక్టర్స్ లా ఉండవు. అవి కథలో సహజంగా ప్లే అవుతూ ఉంటాయి అంటూ చెప్పుకొచ్చింది శాన్వి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Sethupathi: అందుకే విజయ్ సేతుపతి పై దాడి చేశా.. అసలు విషయం బయట పెట్టిన మహా గాంధీ..

Anasuya Bharadwaj: రేపు పుష్ప నుంచి మరో అప్‌డేట్‌.. అనసూయ ఫస్ట్‌లుక్ ను విడుదల చేయనున్న చిత్రబృందం

SP Balasubrahmanyam: మరణాంతరం ఎస్పీబీకి పద్మ విభూషణ్‌తో సత్కారం.. తండ్రి తరపున అవార్డు అందుకున్న తనయుడు చరణ్

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే