Rajeev Rayala | Edited By: Ravi Kiran
Updated on: Nov 10, 2021 | 6:36 AM
అతుల్య రవి.. ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపించకపోయిన త్వరలో మారుమ్రోగే అవకాశం ఉంది.
తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా దూసుకుపోతుంది ముద్దుగుమ్మ అతుల్య రవి.
అక్కడ వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ ప్రేక్షకులలో క్రేజ్ సొంతం చేసుకుంటుంది.
ఇక ఇప్పుడు ఈ వయ్యారి భామ టాలీవుడ్ సినిమాలో మెరవబోతుందని తెలుస్తుంది.
దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న సినిమాలో అతుల్య రవి హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.
ఏజెంట్ సినిమాకు మరింత గ్లామర్ ను యాడ్ చేస్తూ, సెకండ్ హీరోయిన్ పాత్రకు అతుల్య రవిని తీసుకున్నట్టు టాక్
ఈ వార్త నిజమైతే ఇక పై అతుల్య రవికి టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కట్టే ఛాన్స్ ఉంది.