Samantha: గాయాల నుంచి ఉపశమనం పొందే మార్గం.. ఇక జరిగింది చాలు.. సమంత ఆసక్తికర పోస్ట్..
సమంత.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన సన్నిహితులతో కలిసి విదేశి టూర్స్ చేస్తూ అందుకు
సమంత.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన సన్నిహితులతో కలిసి విదేశి టూర్స్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తుంది. కేవలం ఫోటోస్.. పర్సనల్ విషయాలు మాత్రమే కాకుండా.. ఇటీవల గత కొన్ని రోజులుగా ఆసక్తికర కోట్స్ కూడా సామ్ షేర్ చేస్తుంది. మై మామ్స్ సెడ్ అంటూ పలుమార్లు ఇంట్రెస్టింగ్ పోస్ట్స్ చేసిన సమంత.. కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ కోట్స్ షేర్ చేస్తుంది. అయితే విడాకుల ప్రకటన తర్వాత.. నిశ్బబ్దం వహించిన సామ్ ఆ తర్వాత యాక్టివ్ అయ్యింది.. ప్రస్తుత కఠినమైన పరిస్థితుల నుంచి తనను తాను బయటపడేందుకు కాస్త సమయం ఇవ్వాలని నెటిజన్స్‌కు విజ్ఞప్తి చేసింది సామ్..
అయితే ప్రస్తుత తన మానసిక పరిస్థితిని వివరించడానికి ఇలా ఆసక్తికర కోట్స్ షేర్ చేస్తుందా ? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు. ఇదిలా ఉంటే.. తాజాగా సామ్ తన ఇన్‌స్టా స్టోరీలో అమెరికా రచయిత జామీ వారున్ కోట్‌ను పోస్ట్ చేసింది.. “మీరు మహా సామ్రాజ్యాలను నిర్మించాల్సిన అవసరం లేదు ? లేదా పరిశ్రమను శాసించాలా ? లేదా ఎందులోనైనా నెంబర్ వన్ అవుతారా ? మీరు ఆనందరకరమైన జీవితాన్ని కోరుకుంటే ఎలా ఉంటుంది ? గాయాల నుంచి ఉపశమనం పొందే మార్గాన్ని అన్వేషించి హాయిని పొందితే ఎలా ఉంటుంది ? విజయానికి కొత్త నిర్వచనం తెలుసుకుంటే ఏమనిపిస్తుంది ? నీ విలువలకు తగినట్లుగా జీవితాన్ని పొందడం గురించి ఆలోచించడం ఎలా అనిపిస్తుంది ? ఫిల్టర్లను తీసివేసి నీ దృష్టి కోణంలో జీవితాన్ని తరచి చూసి అందులోని శక్తిని ఆస్వాదిస్తే ఎలా ఉంటుంది? అత్యాశకు పోకుండా నీకున్న సమయంలో సంతృప్తికరమైన జీవితాన్ని గడిపితే ఏమనిపిస్తుంది? ఇక జరిగింది చాలనుకుని సర్దుకుపోతే ఎలా ఉంటుంది?” ఇలాంటి అనుభవాలన్ని ఎంత గొప్పగా ఉంటాయి కదా.. అంటూ సమంత సుధీర్ఘ పోస్ట్ చేసింది.
గతంలోనూ సామ్.. ఆడపిల్లల చదువు.. పెళ్లి గురించి ఆసక్తికర పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. అయితే సమంత .. ఇలాంటి పోస్ట్ ఎందుకు చేస్తుంది ? ఎవరిని ఉద్దేశించి చేస్తుంది? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
View this post on Instagram
Also Read: Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్‌బాస్‌లో నా సపోర్ట్ అతనికే.. సోనూసూద్ వీడియో వైరల్..
Bigg Boss 5 Telugu: సీక్రెట్ రూంలో జెస్సీ.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్..
Shanvi Meghana: ఆ స్టార్ డైరెక్టర్ నన్ను తమన్నా సిస్టర్ లా ఉంది అన్నారు : శాన్వి మేఘన