Gangavva New House: నాగార్జున సాయంతో సొంత ఇంటి కల నెరవేర్చుకున్న గంగవ్వ.. గృహప్రవేశం ఫోటోలు వైరల్

Gangavva House Warming Function : సోషల్ మీడియా ప్రతిభ ఉన్న సామాన్యులను కూడా చిన్న పాటి సెలబ్రేటీలుగా మార్చేసింది. తమకు తెలిసిన పనులతో, వంటలతో, ఆర్ట్స్ తో సోషల్ మీడియాలో..

Gangavva New House: నాగార్జున సాయంతో సొంత ఇంటి కల నెరవేర్చుకున్న గంగవ్వ.. గృహప్రవేశం ఫోటోలు వైరల్
Gangavva
Follow us
Surya Kala

|

Updated on: Nov 09, 2021 | 5:31 PM

Gangavva House Warming Function : సోషల్ మీడియా ప్రతిభ ఉన్న సామాన్యులను కూడా చిన్న పాటి సెలబ్రేటీలుగా మార్చేసింది. తమకు తెలిసిన పనులతో, వంటలతో, ఆర్ట్స్ తో సోషల్ మీడియాలో ఫేమస్ అయినవారు ఎందరో ఉన్నారు. అలాంటి సెలబ్రెటీల్లో ఒకరు గంగవ్వ. సాధారణ పల్లెటూరి మహిళ గంగవ్వ… మై విలేజ్ షో యూట్యూబ్ చానల్ తో ఫేమస్ అయింది. అంతేకాదు.. అనంతరం తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షోలో అడుగు పెట్టి.. యావత్ తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను అలరించింది. తాజాగా గంగవ్వ తన చిరకాల స్వప్నం నెరవేర్చుకుంది. వివరాల్లోకి వెళ్తే..

గంగవ్వ జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి లో కొత్తగా నిర్మించుకున్న ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. ఈ నూతన గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గంగవ్వ కొత్త ఇంటికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, తో పాటు బిగ్ బాస్ సీజన్ 4 లోని సభ్యులు గంగవ్వతో పాటు ఉన్న శివజ్యోతి , అఖిల్ లు హాజరయ్యారు. ఇక గంగవ్వ బంధుమిత్రులు, గ్రామస్థులు శుభకార్యానికి హాజరయ్యారు. ఫంక్షన్ కు హాజరైన శివజ్యోతి గంగవ్వ గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

నిజానికి గంగవ్వ తనకు సొంత ఇల్లు కట్టుకోవడం కల అని బిగ్ బాస్ హౌస్ లో హోస్ట్ నాగార్జున కు చెప్పింది, అప్పుడు నాగార్జున గంగవ్వ కల నెరవేరుస్తానని.. ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తానని అప్పుడు మాట ఇచ్చారు. రూ. 7 లక్షల రుపాయలను అందించారు. దీంతో నాగార్జున ఇచ్చిన డబ్బులకు జతగా బిగ్ బాస్ షో నుంచి వచ్చిన డబ్బులను చేర్చి సొంత ఇంటి కల నెరవేర్చుకుంది గంగవ్వ. ప్రస్తుతం గంగవ్వ తన సొంత ఇంట్లోకి ప్రవేశించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.

Also Read:  ఏపీ పీజీ సెట్ ఫలితాలను రిలీజ్ చేసిన మంత్రి సురేష్.. అర్హత సాధించిన 24వేల మంది స్టూడెంట్స్

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..