AP PG Cet 2021: ఏపీ పీజీ సెట్ ఫలితాలను రిలీజ్ చేసిన మంత్రి సురేష్.. అర్హత సాధించిన 24వేల మంది స్టూడెంట్స్

AP PG Cet 2021 Results: ఆంధ్రప్రదేశ్  లోని పీజీ సెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో రిలీజ్ చేశారు. పోస్టు గ్రాడ్యుయేషన్..

AP PG Cet 2021: ఏపీ పీజీ సెట్ ఫలితాలను రిలీజ్ చేసిన మంత్రి సురేష్.. అర్హత సాధించిన 24వేల మంది స్టూడెంట్స్
Audimulapu Suresh
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Nov 09, 2021 | 5:41 PM

AP PG Cet 2021 Results: ఆంధ్రప్రదేశ్  లోని పీజీ సెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో రిలీజ్ చేశారు. పోస్టు గ్రాడ్యుయేషన్ (ఎమ్మెస్సి , ఎం కామ్, ఎమ్మెఏ, ) తదితర కోర్సుల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను ఈరోజు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల మంత్రి సురేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అక్టోబరు 22 నుంచి 26 వరకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలకు 35,573మంది హాజరయ్యారని తెలిపారు. అంతేకాదు.. పరీక్ష నిర్వహించిన 15 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసామని అన్నారు.

145 పీజీ ప్రోగ్రామ్స్ కి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మొదటిసారి నిర్వహించామని ఈ సందర్భంగా గుర్తు  చేశారు మంత్రి సురేష్. ఇక ఈ ఫలితాల్లో మొత్తం 24వేల మంది విద్యార్థులు మాస్టర్స్  ఎంట్రన్స్ లో అర్హత సాధించారని తెలిపారు. యూనివర్సిటీల వారీగా పరీక్షల నిర్వహణ అవసరం లేకుండా ఒకే పరీక్ష నిర్వహించామని.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఒకే సిలబస్ అమలు చేస్తున్నామని తెలిపారు.

Also Read:  : సికింద్రాబాద్ వేదికగా టెన్త్ అర్హతతో ఇండియన్ ఆర్మీ త్వరలో భారీ రిక్రూట్‌మెంట్ .. పూర్తి వివరాల్లోకి వెళ్తే..