Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Army Recruitment Rally: సికింద్రాబాద్ వేదికగా టెన్త్ అర్హతతో ఇండియన్ ఆర్మీ త్వరలో భారీ రిక్రూట్‌మెంట్ .. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Army Recruitment Rally: దేశ రక్షణ కోసం ఆర్మీలో ఉద్యోగం చేయాలనికోరుకునే యువతకు గుడ్ న్యూస్.  కేంద్ర రక్షణ శాఖ తెలంగాణలో ఆర్మీ రిక్యుట్మెంట్ ర్యాలీని...

Army Recruitment Rally: సికింద్రాబాద్ వేదికగా టెన్త్ అర్హతతో ఇండియన్ ఆర్మీ త్వరలో భారీ రిక్రూట్‌మెంట్ .. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Army Recruitment Rally
Follow us
Surya Kala

|

Updated on: Nov 09, 2021 | 3:25 PM

Army Recruitment Rally: దేశ రక్షణ కోసం ఆర్మీలో ఉద్యోగం చేయాలనికోరుకునే యువతకు గుడ్ న్యూస్.  కేంద్ర రక్షణ శాఖ తెలంగాణలో ఆర్మీ రిక్యుట్మెంట్ ర్యాలీని ఈనెలాఖరున నిర్వహించనున్నామని ప్రకటించింది. ఈ ర్యాలీకి వేదికగా సికింద్రాబద్ఫ్ లోని హెడ్‌క్వార్టర్స్ లో ఆర్మీ ర్యాలీని చేపట్టనున్నామని భారత ఆర్మీ తెలిపింది. ఈ ర్యాలీలో సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్ (AE) సహా పలు పోస్టులను రక్షణ మంత్రిత్వ శాఖ  భర్తీ చేయనుంది.  అయితే, ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహించడం ప్రస్తుత COVID-19 మహమ్మారి పరిస్థితికి లోబడి ఉంటుందని పేర్కొంది. అవసరం అయితే రిక్రూట్‌మెంట్ ర్యాలీ తేదీల్లో మార్పులు ఉండవచ్చని తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులకోసం పూర్తి వివరాలు..

ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ 2021:

ఖాళీ వివరాలు: సోల్జర్ జనరల్ డ్యూటీ సోల్జర్ టెక్ (AE) సోల్జర్ ట్రేడ్స్‌మెన్ సోల్జర్ Clk/SKT (AOC వార్డ్ కేటగిరి)

స్పోర్ట్స్ కేటగిరి:  బాక్సింగ్, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, స్విమ్మింగ్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, కబడ్డీ , క్రికెట్‌లలో దేనిలోనైనా ప్రాతినిధ్యం వహించిన అత్యుత్తమ క్రీడాకారులు ఔట్‌స్టాండింగ్ స్పోర్ట్స్‌మెన్ ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థి సీనియర్ లేదా జూనియర్ స్థాయిలో జాతీయ లేదా అంతర్జాతీయ పోటీలలో రాష్ట్రం లేదా దేశానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి. స్క్రీనింగ్ తేదీలో సర్టిఫికేట్ రెండు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.

ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ 2021: వయో పరిమితి సోల్జర్ జనరల్ డ్యూటీ – 17.5 నుండి 21 సంవత్సరాలు సోల్జర్ టెక్ (AE) – 17.5 నుండి 21 సంవత్సరాలు సోల్జర్ ట్రేడ్స్‌మెన్ – 17.5 నుండి 23 సంవత్సరాలు సోల్జర్ Clk/SKT – 17.5 నుండి 23 సంవత్సరాలు

విద్యార్హత: సోల్జర్ జనరల్ డ్యూటీ – పదవ తరగతి ఉత్తీర్ణత/ SSC ప్రతి సబ్జెక్టులో 33%  మార్కులు..  మొత్తం 45% మార్కులతో ఉతీర్ణత అయి ఉండాలి. సోల్జర్ టెక్ (AE) –  10+2 ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత .. మొత్తం 50% మార్కులతో (ప్రతి సబ్జెక్టులో 40%). కలిగి ఉండాలి. సోల్జర్ ట్రేడ్స్‌మెన్ -(33%) శాతంతో 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. సోల్జర్ Clk/SKT – 10+2/ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఏదైనా స్ట్రీమ్‌లో మొత్తం 60% మార్కులు కలిగి ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత. 12వ తరగతిలో ఇంగ్లిష్‌లో 50%, మ్యాథ్స్/ అకౌంట్స్/ బుక్‌కీపింగ్ తప్పనిసరి.

ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించే తేదీలు: ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నవంబర్ 29, 2021 నుండి జనవరి 30, 2022 వరకు నిర్వహించబడుతుంది.

ఓపెన్ కేటగిరీలో భాగంగా స్పోర్ట్స్ ట్రయల్ కోసం నవంబర్ 26, 2021న ఉదయం 8 గంటలకు AOC సెంటర్, సికింద్రాబాద్‌లోని థాపర్ స్టేడియంలో రిపోర్ట్ చేయాలి.

ఇతర వివరాలకు, అభ్యర్థులు హెడ్క్వార్టర్స్ AOC సెంటర్, ఈస్ట్ మారేడుపల్లి , తిరుమల గిరి,  సికింద్రాబాద్, తెలంగాణ  500015. సంప్రదించగలరు.  నియామక ర్యాలీ గురించి మరింత సమాచారం కోసం సమాచారం, అభ్యర్థులు కూడా ఇ-మెయిల్ ద్వారా హెడ్క్వార్టర్స్ AOC సెంటర్ సంప్రదించవచ్చు airawat0804 @ NIC .in  లేదా  www.joinindianarmy@nic.in .

18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్
18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!