AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unique Marriage: వింత ఆచారం.. ఈ గ్రామంలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇల్లరికం వెళ్లాల్సిందే.. ఎక్కడంటే..

Unique Marriage: దీపావళి పండగ తర్వాత పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది.  అయితే మన భారతీయ హిందూ సంప్రదాయంలో ఎక్కువగా పెళ్లి తర్వాత అమ్మాయి..

Unique Marriage: వింత ఆచారం.. ఈ గ్రామంలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇల్లరికం వెళ్లాల్సిందే..  ఎక్కడంటే..
Rajasthan Marriage
Surya Kala
|

Updated on: Nov 09, 2021 | 5:59 PM

Share

Unique Marriage: దీపావళి పండగ తర్వాత పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది.  అయితే మన భారతీయ హిందూ సంప్రదాయంలో ఎక్కువగా పెళ్లి తర్వాత అమ్మాయి అబ్బాయికి ఇంటికి వెళ్తుంది. అంతేకానీ అబ్బాయి అమ్మాయి ఇంటికి ఇల్లరికం రావడం అంటే చాలా అవమానంగా భావిస్తారు. అందుకనే సాధారణంగా పెళ్లయ్యాక ఆడపిల్లలు అత్తమామల ఇంటికి వెళ్లి అక్కడ జీవితాంతం గడుపుతారు. అయితే మన దేశంలోనే వివాహం అనంతరం అబ్బాయి.. తన ఇంటిని తన కుటుంబ సభ్యులను విడిచి అమ్మాయి ఇంటికి వెళ్తాడు.  ఈ వింత సంప్రదాయం రాజ‌స్థాన్‌లో ఉంది. వివరాల్లోకి వెళ్తే..

మౌంట్ అబు న‌గ‌రానికి 10 కిలోమీట‌ర్ల దూరంలో జ‌వాయి అనే  గ్రామంలో కొన్ని వందల ఏళ్లుగా ఓ వింత ఆచారం   కొన‌సాగుతుంది. ఇక్కడ పెళ్లైన త‌రువాత అబ్బాయిలు ఇల్ల‌రికం వ‌స్తారు. అబ్బాయి అత్త‌వారింటికి వ‌చ్చి అక్క‌డే స్థిర‌ప‌డ‌తాడు. అంతేకాదు అక్క‌డే ప‌నులు చూసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటాడు.

అంద‌రిలా కాకుండా జ‌వాయి గ్రామంలో దాదాపు ఈ వింత ఆచారం 700 ఏళ్లుగా కొన‌సాగుతుంది. దీనికి కారణం  ఏమిటి అంటే ఎవరి వద్ద సరైన సమాధానం లేదు.  ఈ గ్రామంలో 240 కుటుంబాలు నివసిస్తున్నాయి. సుమారు 700 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఆడపిల్లలు ఎక్కువగా ఉండేవారని, దీంతో వారి వివాహానికి ఇబ్బంది ఏర్పడిందని తమ పూర్వీకులు చెబుతుండేవారని ఈ గ్రామ నివాసి తెలిపారు. ఇద్దరు సోదరులు జివాజీ , కన్హాజీ ఈ గ్రామానికి చెందిన ఇద్దరు కుమార్తెలను వివాహం చేసుకున్నారు. జివాజీ రంభ అనే అమ్మాయిని వివాహం చేసుకుని జవాయి గ్రామంలో స్థిరపడ్డాడు. రెండవ సోదరుడు కన్హాజీ పవనాను వివాహం చేసుకున్నాడు. జవాయి గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో తన భార్యతో స్థిరపడ్డాడు.

జవాయి గ్రామంలో ఇల్లరికం వచ్చిన వారు కొంత మంది కుటుంబ సభ్యులు వ్యవసాయం, కూరలు అమ్మడం, పండించడం , డ్రైవింగ్ చేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ మౌంట్ అబూ ప్రాంతంలో మొత్తం 16 గ్రామాలు ఉన్నాయి. వీటిలో షేర్ గ్రామం, ఉత్రాజ్ గ్రామం, గోవా గ్రామం, మంచ్ గ్రామం, హేతమ్‌జీ గ్రామం, అర్నా గ్రామం, సాల్ గ్రామం మొదలైనవి ఉన్నాయి. ఇదే సాంప్రదాయం ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి హింగుల్‌పూర్ గ్రామంలో కూడా ఉంది. ఈ గ్రామంలో కూడా పెళ్లయిన తర్వాత కూడా వరుడు గృహిణిగా జీవించాల్సి వస్తోంది. అత్తమామల తరపున అల్లుడికి ఉపాధి లేదా ఉపాధి మార్గాలను చూపిస్తారు.

Also Read: కష్టపడకుండానే కోటి రూపాయలు కొట్టెయ్యడానికి కంత్రీ ప్లాన్.. బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్ తో బీమా క్లెయిమ్..