బాస్మతి బిర్యానీ ఇప్పుడు చాలా ఖరీదు.. ఈ విషయం తెలిస్తే నిజమే అంటారు..!

Basmati Rice: అక్టోబర్ నెలాఖరులో కురిసిన భారీ వర్షాలకు వరి పంట బాగా దెబ్బతింది. దీంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఉత్పత్తి 20 శాతం వరకు తగ్గింది. రానున్న రోజుల్లో

బాస్మతి బిర్యానీ ఇప్పుడు చాలా ఖరీదు.. ఈ విషయం తెలిస్తే నిజమే అంటారు..!
Basmati Rice
Follow us

|

Updated on: Nov 09, 2021 | 6:10 PM

Basmati Rice: అక్టోబర్ నెలాఖరులో కురిసిన భారీ వర్షాలకు వరి పంట బాగా దెబ్బతింది. దీంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఉత్పత్తి 20 శాతం వరకు తగ్గింది. రానున్న రోజుల్లో బాస్మతి బియ్యం ధర క్వింటాల్‌కు రూ.2000 పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.8500 ధర పలుకుతోంది. అదే సమయంలో చిల్లరగా కిలో బాస్మతి బియ్యం 70 నుంచి 90 రూపాయల వరకు లభిస్తుంది.

బాస్మతి బియ్యం భారతదేశం నుంచి150 దేశాలకు ఎగుమతి అవుతుంది. దేశంలోని పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ మూడు రాష్ట్రాల్లో బాస్మతి సాగు చేస్తున్నారు. బాస్మతి బియ్యం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, సహరాన్‌పూర్, ఆగ్రా, అలీఘర్, మొరాదాబాద్, బరేలీలోని అన్ని జిల్లాల్లో పండిస్తారు. ఇక్కడి నేల, వాతావరణం కూడా బాస్మతి వరికి అనుకూలం. నీటిపారుదల సౌకర్యాలు కూడా ఎక్కువ. దాని ప్రత్యేక రుచి, లక్షణాల కారణంగా బాస్మతి ప్రపంచవ్యాప్తంగా ఫుడ్, రెస్టారెంట్ పరిశ్రమలో ప్రీమియం రైస్‌గా తన ఉనికిని చాటుతోంది.

ఏడు రాష్ట్రాల్లోని 95 జిల్లాలు భౌగోళిక సూచిక (GI) ట్యాగ్‌ని పొందాయి. వీటిలో పంజాబ్, హర్యానా, హిమాచల్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌లోని జిల్లాలు ఉన్నాయి. బాస్మతి బియ్యాన్ని ఇండో-గంగా మైదానంలో పండిస్తారు. అంటే హిమాలయాల దిగువ ప్రాంతంలోని గంగా మైదానాల్లో ఉత్పత్తి చేస్తారు. ఇందులో పాకిస్థాన్‌లో భాగమైన పంజాబ్‌లో కూడా 14 జిల్లాలు ఉన్నాయి.

బాస్మతి బియ్యం ధర ఎందుకు పెరుగుతుంది? అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల ఈసారి బాస్మతి వరి పంట దెబ్బతిందని వరి సీనియర్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రానున్న రోజుల్లో బాస్మతి బియ్యం ధర క్వింటాల్‌కు రూ.11 వేలకు చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దీని ప్రభావం ఎగుమతులపై కూడా పడుతుంది. వర్షం కారణంగా ఈసారి బియ్యం నాణ్యత లేకుండా పోయిందని వ్యాపారులు చెబుతున్నారు. పొలంలో నీరు నింపడం వల్ల ధాన్యం నల్లగా మారుతుందన్నారు. గంగానది ఒడ్డున వర్షాలు, వరదల కారణంగా 20-25 శాతం వరి నష్టం వాటిల్లింది.

One Plus మొబైల్‌ వాడుతున్నారా జాగ్రత్త..! మూడు నెలల్లో మూడో ఫోన్‌ పేలింది..

Viral Photos: ఆకాశంలో తలకిందులుగా ఎగిరే హంసని ఎప్పుడైనా చూశారా..! ఈ ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోతారు

Jai Bhim: మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న జై భీమ్‌ సినిమా.. ఐఎమ్‌డీబీ ర్యాంకింగ్స్‌లో ఏకంగా..