AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jai Bhim: మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న జై భీమ్‌ సినిమా.. ఐఎమ్‌డీబీ ర్యాంకింగ్స్‌లో ఏకంగా..

Jai Bhim: సూర్య హీరోగా తెరకెక్కిన జై భీమ్‌ చిత్రం రికార్డులను తిరగరాస్తూనే ఉంది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైన ఈ సినిమా మౌత్‌ టాక్‌తోనే ఇండియా మొత్తం చుట్టేస్తోంది. దళిత వర్గానికి చెందిన వారిపై పోలీసులు..

Jai Bhim: మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న జై భీమ్‌ సినిమా.. ఐఎమ్‌డీబీ ర్యాంకింగ్స్‌లో ఏకంగా..
అన‌గారిన వ‌ర్గానికి చెందిన అమాయ‌కుడిపై పోలీసులు త‌ప్పుడు దొంగ‌త‌నం ఆరోప‌ణ‌ల‌తో దాష్టికానికి దిగితే అత‌ని త‌ర‌ఫున పోరాటం చేసిన న్యాయ‌వాది నిజ జీవితాన్ని ఇతివృత్తంగా తెర‌కెక్కిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.
Narender Vaitla
|

Updated on: Nov 09, 2021 | 4:47 PM

Share

Jai Bhim: సూర్య హీరోగా తెరకెక్కిన జై భీమ్‌ చిత్రం రికార్డులను తిరగరాస్తూనే ఉంది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైన ఈ సినిమా మౌత్‌ టాక్‌తోనే ఇండియా మొత్తం చుట్టేస్తోంది. దళిత వర్గానికి చెందిన వారిపై పోలీసులు ఎలాంటి దాష్టికాలకు పాల్పడ్డారు అన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. దగాపడ్డ దళితుల తరఫున నిలబడి వాదించిన లాయర్‌ పాత్రలో సూర్య నటన అద్భుతంగా ఉంది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమాకు సంబంధించిన చర్చే జరుగుతోంది. ఏ ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నా.. ‘జై భీమ్‌’ చూశావా.? అని ప్రశ్నిస్తున్నారంటే ఈ సినిమా ఎంతటి ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

1995లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా అత్యంత సహజంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తోంది. ఈ సినిమాను జస్టిస్ చంద్రు జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ప్రేక్షకులు ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు. దీంతో ఈ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. ప్రముఖ మూవీ రేటింగ్​ సంస్థ ఐఎమ్‌డీబీ సినిమాల జాబితాలో జై భీమ్‌ ఏకంగా మొదటి స్థానంలో నిలిచి సంచలనం సృష్టించింది. సుమారు 53,000 ఓట్లు, 9.6 రేటింగ్‌తో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది.

ఈ జాబితాలో మొన్నటి వరకు మొదటి స్థానంలో ఉన్న ప్రముఖ చిత్రం ది షాషాంక్ రిడంప్షన్‌ను వెనక్కి నెట్టి మరీ జై భీమ్‌ దూసుకుపోయింది. ఇక ప్రపంచ ప్రఖ్యాత సినిమా గాడ్‌ ఫాదర్‌ మూడో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే సూర్య హీరోగా తెరకెక్కిన.. ఐఎమ్‌డీబీ టాప్‌ 10 జాబితాలో చోటు దక్కించునున్న వాటిలో జై భీమ్‌ రెండో చిత్రం కావడం విశేషం. గతంలో సూర్య నటించిన ‘సూరరై పోట్రు’ (ఆకాశం నీ హద్దు రా) సినిమా ఐఎమ్‌డీబీ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.

Also Read: Heart Stroke: గుండెపోటులో 2 రకాలు.. మినీ స్ట్రోక్ vs రెగ్యులర్ స్ట్రోక్.. అంటే ఏంటో తెలుసుకోండి..

Tulasi Gowda: వన సామ్రాజ్య సృష్టికర్త తులసమ్మను వరించిన పద్మ శ్రీ.. ప్రధానినే ఆకర్షించిన ఈ 72 ఏళ్ల మహిళ ఎవరంటే..

Covid Vaccine: బ్రిటన్‌కు వెళ్లే భారత ప్రయాణికులకు శుభవార్త.. కోవాగ్జిన్ తీసుకున్నవారికి అనుమతి.. ఎప్పటి నుంచి అంటే?

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?