Tulasi Gowda: వన సామ్రాజ్య సృష్టికర్త తులసమ్మను వరించిన పద్మ శ్రీ.. ప్రధానినే ఆకర్షించిన ఈ 72 ఏళ్ల మహిళ ఎవరంటే..
Tulasi Gowda: రాష్ట్రపతి భవన్ వేదికగా ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ చేతులు మీదుగా సోమవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే వేదిక మీదకు ఓ 72 ఏళ్ల మహిళ..
Tulasi Gowda: రాష్ట్రపతి భవన్ వేదికగా ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ చేతులు మీదుగా సోమవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే వేదిక మీదకు ఓ 72 ఏళ్ల మహిళ కాళ్లకు చెప్పులు లేకుండా, సాధారణ చీర మాత్రమే ధరించి వచ్చారు. ఆమె స్టేజ్ పైకి రాగానే వేడుకకు హాజరైన వారంతా ఆమెవైపు ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూశారు. ఆ మహిళ పేరే తులసి గౌడ.. ఒక గిరిజన కుటుంబంలో జన్మించిన ఓ మహిళ పద్మ శ్రీ అవార్డు అందుకునే స్థాయికి ఎలా ఎదిగారు.? ఇంతకీ ఆమె సాధించిన ఆ గొప్ప పని ఏంటన్న విషయాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
తులసి గౌడ.. కర్ణాటకలోని అంకోలా తాలుకా హొన్నాలి గ్రామంలో హలక్కీ అనే గిరిజన కుటుంబంలో జన్మించారు. ఆమె జన్మించిన రెండేళ్లకే తండ్రి మరణిచారు. దీంతో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూలీ పనికి వెళ్లేవారు. ఆ తర్వాత 12 ఏళ్ల వయసులోనే గోవింద గౌడ అనే వ్యక్తితో ఆమెకు వివాహ జరిగింది. అయితే వివాహమైన రెండేళ్లకే భర్త కూడా మరణించడంతో ఆ బాధ నుంచి బయట పడేందుకు అడవిలో గడుపుతూ.. చెట్లతో స్నేహం చేయడం మొదలు పెట్టారు. అలా ఆమెకు తెలియకుండానే మొక్కలపై ప్రేమను పెంచుకుంది. నిత్యం చెట్లతో ఉండడంతో అది గమినించిన అటవీ శాఖ అధికారులు తులసికి తాత్కాలిక ఉద్యోగిగా నియమించుకుని కొన్నేళ్ల తర్వాత పర్మినెంట్ చేశారు. 14 ఏళ్లు ఉద్యోగం చేసిన తర్వాత ఉద్యోగ విమరణ పొందారు. అయితే చెట్లతో ఆమె బంధాన్ని మాత్రం తెంపుకోలేక పోయారు. ఇప్పటికీ మొక్కలు నాటుతూనే ఉన్నారు. నాటడమే కాకుండా వాటిని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు.
ఇలా తులసి తన అరవై ఏళ్ల జీవితంలో నలభై వేల మొక్కలు నాటి ఏకంగా ఓ వన సామ్రాజ్యాన్నే సృష్టించారు. ఇలా పర్యవరణానికి ఎనలేని కృషి చేసిన, చేస్తోన్న తులసి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తులసిని పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇక తులసికి చదువు లేకపోయినా చెట్ల గురించి ఎంతో అవగాహన ఉంది. చెట్లను ఎప్పుడు నాటాలి.? ఎన్ని నీళ్లు పోయాలి, వాటి ఔషధ గుణాలు ఏంటి అన్న విషయాన్ని సులభంగా చెప్పేస్తారు. శాస్త్రవేత్తలు కూడా ఆమె విజ్ఙానాన్ని చూసి అబ్బుర పడుతుంటారు. ఇక పర్యావరవేత్తలైతే ఆమెను ‘ఎన్‌సైక్లోపిడియా ఆఫ్ ఫారెస్ట్’గా పిలుస్తారు. ఒక్క మొన్న నాటి దాంతో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకునే వారున్న ఈ రోజుల్లో.. 40 వేల మొక్కలు నాటి కూడా ఎంతో నిరాడంబరంగా ఉన్న తులసి నిజంగానే ఈ తరం వారికి ఆదర్శమనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కదూ.!
Smt Tulsi Gowda is awarded Padma Shri for Social Work.
She is an environmentalist from Karnataka who has planted more than 30,000 saplings and has been involved in environmental conservation activities for the past six decades. pic.twitter.com/pgwXMYx8ZD
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) November 8, 2021