Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Cruise Drug Case: ఆ మంత్రికి దావూద్‌ గ్యాంగ్‌తో లింక్.. మహా మంత్రిపై ఫడ్నవీస్‌ సంచలన ఆరోపణలు..

ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ పార్టీ కేసులో రాజకీయ రగడ కొనసాగుతోంది. ఎన్సీబీ అధికారి సమీర్‌ వాంఖడేను తన ట్వీట్లతో ముప్పుతిప్పలు పెడుతున్న మహారాష్ట్ర మంత్రి నవాబ్‌మాలిక్‌పై..

Mumbai Cruise Drug Case: ఆ మంత్రికి దావూద్‌ గ్యాంగ్‌తో లింక్.. మహా మంత్రిపై ఫడ్నవీస్‌ సంచలన ఆరోపణలు..
Devendra Fadnavis On Minist
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 09, 2021 | 2:06 PM

Underworld Links: ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ పార్టీ కేసులో రాజకీయ రగడ కొనసాగుతోంది. ఎన్సీబీ అధికారి సమీర్‌ వాంఖడేను తన ట్వీట్లతో ముప్పుతిప్పలు పెడుతున్న మహారాష్ట్ర మంత్రి నవాబ్‌మాలిక్‌పై సంచలన ఆరోపణలు చేశారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌. నవాబ్‌మాలిక్‌కు దావూద్‌ గ్యాంగ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ముంబై పేలుళ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న దోషుల దగ్గరి నుంచి నవాబ్‌మాలిక్‌ చవగ్గా ఆస్తులను కొనుగోలు చేశారని ఆరోపించారు ఫడ్నవీస్‌. నవాబ్‌మాలిక్‌ దగ్గర ఉన్న ఆస్తుల్లో నాలుగు ఆస్తులు అండర్‌వాల్డ్‌తో లింక్‌ ఉన్నాయని ఆరోపించారు. దీనిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఎన్సీపీ అధినేత శరద్‌పపవార్‌కు కూడా డాక్యుమెంట్లు అందిస్తానని తెలిపారు.

పూటకో మలుపు..

ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసు పూటకో మలుపు తిరుగుతోంది. షారూఖ్‌ఖాన్‌ కారు డ్రైవర్‌ను ఎన్సీబీ విచారించిన సంగతి తెలిసిందే.. క్రూయిజ్‌ దగ్గర షారూఖ్‌ కుమారుడు ఆర్యన్‌ను అతడే డ్రాప్ చేశాడు. డ్రైవర్‌ స్టేట్‌మెంట్‌ను ఎన్సీబీ రికార్డు చేసింది. ముంబై సెషన్స్ కోర్టులో మరోసారి ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. వచ్చేవారం ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతుంది.

ఆర్యన్‌ఖాన్‌ ఫ్రెండ్‌ అర్బాజ్‌ తన షూలో దాచిన 6 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పంచనామాలో పేర్కొంది ఎన్సీబీ. మీ దగ్గర ఏమైనా డ్రగ్స్ ఉన్నాయాని ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్‌ను ప్రశ్నించగా..డ్రగ్స్ ఉన్నాయని అర్బాజ్ మర్చంట్ అంగీకరించాడని ఎన్ సీబీ అధికారులు పంచమనాలో స్పష్టం చేశారు. కిరణ్‌ గోసావి, ప్రభాకర్‌ రఘోజిసేన్‌ అనే ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల సమక్షంలో ఆర్యన్‌, అర్బాజ్‌ల వాంగ్మూలాలతో కేసు పంచానామాను రూపొందించినట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: Rafale Deal: మధ్యవర్తికి డసాల్ట్‌ ఏవియేషన్‌ రూ.481 కోట్ల లంచం.. మరోసారి తెరపైకి వచ్చిన రాఫెల్‌ డీల్‌ భూతం..

Sania Mirza Video: భర్త షాయబ్ మాలిక్ సిక్సర్ల మోత.. పాక్ క్రికెటర్ ఆటను ఎంజాయ్ చేసిన సానియా..