Sania Mirza Video: భర్త షాయబ్ మాలిక్ సిక్సర్ల మోత.. పాక్ క్రికెటర్ ఆటను ఎంజాయ్ చేసిన సానియా..

పాకిస్తాన్ సీనియర్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ విరుచుకుపడ్డాడు. అత్యంత వాయువేగంతో ఆఫ్ సెంచరీ పూర్తి చేశాడు.  స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే అజేయంగా 54 పరుగులు చేశాడు.

Sania Mirza Video: భర్త షాయబ్ మాలిక్ సిక్సర్ల మోత.. పాక్ క్రికెటర్ ఆటను ఎంజాయ్ చేసిన సానియా..
Sania Mirza Cheers
Follow us
Sanjay Kasula

| Edited By: Anil kumar poka

Updated on: Nov 08, 2021 | 6:36 PM

పాకిస్తాన్ సీనియర్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ విరుచుకుపడ్డాడు. అత్యంత వాయువేగంతో ఆఫ్ సెంచరీ పూర్తి చేశాడు.  స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే అజేయంగా 54 పరుగులు చేశాడు. పాకిస్తాన్ హిట్టర్ షోయబ్ మాలిక్ టీ20ల్లో అత్యంత వేగంగా ఫిఫ్టీ బాదిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ కూడా అద్భుతమైన ప్రదర్శన చేసింది. పాక్ సారథి బాబర్ అజామ్ అంతకుముందు తనదైన శైలిలో హాఫ్ సెంచరీ సాధించగా, ఇన్నింగ్స్ చివర్లో షోయబ్ మాలిక్ తన బీభత్సమైన బ్యాటింగ్‌తో ప్రేక్షకులను మనసులను దోచుకున్నాడు. వెటరన్ పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ స్కాట్లాండ్‌పై కేవలం 18 బంతుల్లో అజేయంగా 54 పరుగులు చేశాడు. షోయబ్‌ ఇన్నింగ్స్‌తో పాక్‌ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.

షోయబ్ మాలిక్ తన ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు, ఒక ఫోర్‌తో విరుచుకుపడ్డాడు. షోయబ్ మాలిక్ తన ఇన్నింగ్స్‌లో చివరి 7 బంతుల్లో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు.

చివరి 7 బంతుల్లో.. షోయబ్ మాలిక్ తన ఇన్నింగ్స్‌లో చివరి 7 బంతుల్లో 6,1,6,6,4,6,6 పరుగులు చేశాడు. అంటే మాలిక్ మొత్తం 5 సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. మాలిక్ అంతకుముందు 11 బంతుల్లో 19, చివరి ఏడు బంతుల్లో 35 పరుగులు చేశాడు. చివరి 7 బంతుల్లో మాలిక్ స్ట్రైక్ రేట్ 500 నమోదైంది.

షోయబ్ మాలిక్ రికార్డు..

షోయబ్ మాలిక్ పాక్ టీ20ల్లో ఫాస్టెస్ట్ హిట్టర్‌గా నిలిచాడు. మాలిక్ 18 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అంతకుముందు 2010లో ఉమర్ అక్మల్ కేవలం 21 బంతుల్లోనే ఫిఫ్టీ బాదాడు. 11 ఏళ్ల తర్వాత ఈ రికార్డును మాలిక్ బద్దలు కొట్టాడు. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్, షోయబ్ మాలిక్ మాత్రమే 18-18 బంతుల్లో అర్ధ సెంచరీలు సాధించారు. టీ20లో యువరాజ్ సింగ్ 12 బంతుల్లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టాడు. షోయబ్ మాలిక్ స్కాట్లాండ్‌పై సిక్స్ కొట్టే మెషీన్‌గా మారాడని నేను మీకు చెప్తాను. ఈ జట్టుపై గత 3 మ్యాచ్‌ల్లో ఈ ఆటగాళ్లు 16 సిక్సర్లు కొట్టారు.

ఆ సమయంలో సానియా మీర్జా అక్కడే..

షోయబ్ మాలిక్ విరుచుకుపడుతున్న సమయంలో అతని భార్య సానియా మీర్జా కూడా స్టేడియంలోనే ఉంది. సానియా మీర్జా తన కొడుకుతో కలిసి కూర్చుని మ్యాచ్‌ని ఎంజాయ్ చేస్తోంది. ఆపై షోయబ్ మాలిక్ సిక్సర్ల వర్షం కురిపించడంతో స్టేడియం మొత్తం అతని పేరుతో మారుమోగింది. అజేయంగా 54 పరుగులతో పెవిలియన్‌కు చేరుకున్న మాలిక్‌కు అతని భార్య సానియా మీర్జా స్వాగతం పలికింది.

View this post on Instagram

A post shared by ICC (@icc)

ఇవి కూడా చదవండి: Chennai Rains LIVE Updates: నీటమునిగిన చెన్నై మహానగరం.. పడవల్లా తేలియాడుతున్న కార్లు..