Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB Captain: ఆర్‌సీబీకి కొత్త కెప్టెన్ దొరికేశాడుగా.. కోహ్లీని రీప్లేస్ చేసేది మాజీ సన్‌రైజర్స్ ప్లేయర్.!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకుంటున్నట్లు ప్రకటించిన దగ్గర నుంచి.. ఆ ఫ్రాంచైజీకి తదుపరి కెప్టెన్ ఎవరన్న..

RCB Captain: ఆర్‌సీబీకి కొత్త కెప్టెన్ దొరికేశాడుగా.. కోహ్లీని రీప్లేస్ చేసేది మాజీ సన్‌రైజర్స్ ప్లేయర్.!
Virat Kohli
Follow us
Ravi Kiran

| Edited By: Phani CH

Updated on: Nov 08, 2021 | 5:45 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకుంటున్నట్లు ప్రకటించిన దగ్గర నుంచి.. ఆ ఫ్రాంచైజీకి తదుపరి కెప్టెన్ ఎవరన్న దానిపై సర్వత్రా చర్చ మొదలైంది. డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్ వంటి స్టార్ ప్లేయర్స్ పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. కోహ్లీకి వారసుడిగా కెఎల్ రాహుల్ లేదా శ్రేయాస్ అయ్యర్‌లు అవుతారని సమాచారం. అయితే వచ్చే ఏడాది బెంగళూరు జట్టు సారధ్య బాధ్యతలను చేపట్టేందుకు కెఎల్ రాహులే ఫ్రంట్ రన్నర్‌ అని ఇన్‌సైడ్ టాక్.

ఐపీఎల్ 2022కు ముందు మెగా వేలం జరగనుంది. మొత్తం టోర్నీతో పాటు జట్ల రూపురేఖలు కూడా మారిపోనున్నాయి. అందుకే కొత్త జట్టుతో.. కొత్త కెప్టెన్‌తో సరికొత్తగా మారనున్న ఆర్‌సీబీని చూడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ పేర్లు తెరపైకి రావడంతో.. వారు కూడా వారి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లకు కెప్టెన్‌గా ఐపీఎల్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. బ్యాటింగ్‌లో రాహుల్ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. కెప్టెన్‌గా పంజాబ్ కింగ్స్‌కు టైటిల్ కట్టబెట్టకపోయినా.. ఒంటిచేత్తో అనేక విజయాలను అందించాడు. ఇక అయ్యర్ విషయానికి వస్తే 2020 ఎడిషన్‌లో ఢిల్లీ జట్టును మొట్టమొదటిసారి ఫైనల్‌కు చేర్చాడు. అయితే దురదృష్టవశాత్తు ఈ ఏడాది ఐపీఎల్‌కు గాయం కారణంగా దూరమయ్యాడు.

కాగా, వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా కెఎల్ రాహుల్ వ్యవహరించే అవకాశం ఉందని క్రికెట్ పండితులు అంటున్నారు. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి రాహుల్ ఆడిన అనుభవం ఉండటం.. అలాగే బ్యాటింగ్‌లో ప్రస్తుతం రాహుల్ సూపర్ ఫామ్‌లో ఉండటంతో.. ఆ టీం రాహుల్‌ను కోట్లు వెచ్చించి మరీ మెగా వేలంలో కొంటుందని భావిస్తున్నారు. కాగా, రాహుల్ 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున కూడా ఆడిన సంగతి తెలిసిందే.

Also Read:

Dead man’s fingers: భూమి లోంచీ బయటికొచ్చిన చేతి వేళ్లు.. భయంతో వణికిపోయిన జనం.. వీడియో

Viral Video: ఇక్కడ అడుగు పెడితే వందేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది.. వీడియో

Zodiac Signs: ఈ 3 రాశులవారు చాలా ఫన్నీ.. అవి ఏయే రాశులో మీరే చూసేయండి!

అడవి కుక్కలను తప్పించుకోబోయి మొసలికి చిక్కిన జింక.. వీడియో చూస్తే షాకవుతారు!

ఈ 4 పండ్ల కాంబినేషన్‌ చాలా డేంజర్.! వీటిని కలిపి తినొద్దు.! అవేంటో తెలుసా..