Viral Video: అడవి కుక్కలను తప్పించుకోబోయి మొసలికి చిక్కిన జింక.. వీడియో చూస్తే షాకవుతారు!

అదృష్టం బాగోకపోతే.. ఒంటెపై కూర్చున్న మరుగుజ్జును సైతం కుక్క కొరుకుతుంది. ఈ సామెత మీరు వినే ఉంటారు. అసలు ఇది...

Viral Video: అడవి కుక్కలను తప్పించుకోబోయి మొసలికి చిక్కిన జింక.. వీడియో చూస్తే షాకవుతారు!
Crocodile
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 08, 2021 | 9:53 AM

అదృష్టం బాగోకపోతే.. ఒంటెపై కూర్చున్న మరుగుజ్జును సైతం కుక్క కొరుకుతుంది. ఈ సామెత మీరు వినే ఉంటారు. అసలు ఇది ఎందుకు ఇప్పుడు చెబుతున్నానంటే.? ఈ సామెత మనుషులకు మాత్రమే కాదు జంతువులకు కూడా వర్తిస్తుంది. అడవి ప్రపంచం చాలా విచిత్రమైనది. ఎప్పుడు, ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మృత్యువు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. క్రూర జంతువులకు ఆహారం కాకుండా ఉండేందుకు మిగతా జంతువులు చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు బెడిసికొడుతుంటాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..

వైరల్ వీడియో ప్రకారం.. ఓ జింక అడవి కుక్కల నుంచి తప్పించుకునేందుకు నీటిలోకి దిగుతుంది. మృత్యువు నుంచి తప్పించుకున్నానని అనుకున్న జింకకు ఊహించని విధంగా హఠాత్పరిణామం ఏర్పడింది. నీళ్లలో ఓ మొసలి జింకను చూసి వేగంగా దాని వైపుకు దూసుకొచ్చింది. క్షణాల్లో జింకను మట్టుబెట్టి చంపేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా, ఈ వైరల్ వీడియోను ‘iftirass’ అనే నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దీనిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియోకు ఇప్పటిదాకా 1.3 వేల వ్యూస్ రాగా.. వరుసపెట్టి కామెంట్స్, రీ-షేర్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Also Read:

ఈ 3 రాశులవారు ఎలప్పుడూ బిజినెస్ మైండెడ్.! అందులో మీరున్నారా..

తల్లి జీబ్రా సాహసం.. సింహాన్ని వెనుక కాళ్లతో తన్నుతూ.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు.!

వరల్డ్ రికార్డు.. ఒకే ఓవర్‌లో 43 పరుగులు, 6 సిక్సర్లు.. ప్రత్యర్ధి బౌలర్‌కు చుక్కలు.!

తవ్వకాల్లో బయటపడ్డ పురాతన బానిస గది.. అందులో ఏముందో తెలిస్తే షాకే.!