Watch Video: వరల్డ్ రికార్డు.. ఒకే ఓవర్‌లో 43 పరుగులు, 6 సిక్సర్లు.. ప్రత్యర్ధి బౌలర్‌కు చుక్కలు.!

సాధారణంగా ఒక ఓవర్‌లో 20 పరుగులు, లేదా 30 పరుగులు రాబట్టడం మనం చూసే ఉంటాం. మహా అయితే 6 బంతులు 6 సిక్సర్లు...

Watch Video: వరల్డ్ రికార్డు.. ఒకే ఓవర్‌లో 43 పరుగులు, 6 సిక్సర్లు.. ప్రత్యర్ధి బౌలర్‌కు చుక్కలు.!
Cricket
Follow us
Ravi Kiran

| Edited By: Phani CH

Updated on: Nov 08, 2021 | 5:49 PM

సాధారణంగా ఒక ఓవర్‌లో 20 పరుగులు, లేదా 30 పరుగులు రాబట్టడం మనం చూసే ఉంటాం. మహా అయితే 6 బంతులు 6 సిక్సర్లు కొట్టి 36 పరుగులు రాబట్టిన బ్యాటర్లు ఉన్నారు. కానీ మీరెప్పుడైనా ఒకే ఓవర్‌లో 43 పరుగులు వచ్చిన మ్యాచ్‌ను చూశారా.? ఆ ఓవర్‌లో బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురిపించారు. తద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. లిస్ట్-ఏ-క్రికెట్‌లో ఈ ఫీట్ 2018లో సరిగ్గా ఇదే రోజున నమోదైంది. దేశవాళీ టోర్నీలో న్యూజిలాండ్‌కు చెందిన జో కార్టర్, బ్రెట్ హాంప్టన్ ఈ అద్భుతాన్ని సృష్టించారు. ఆ మ్యాచ్ విశేషాలేంటో ఇప్పుడు చూసేద్దాం..

న్యూజిలాండ్ దేశవాళీ టోర్నీ ఫోర్డ్ ట్రోఫీలో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జో కార్టర్, బ్రెట్ హాంప్టన్‌లు కలిసి ఒకే ఓవర్‌లో 43 పరుగులు రాబట్టారు. వీరి విధ్వంసానికి బలైన బౌలర్ విలియం లుడిక్. మొత్తం 8 బంతులు వేసిన లుడిక్ 6 సిక్సర్లు, ఓ ఫోర్ సమర్పించాడు. ఈ మ్యాచ్‌లో నార్తన్ డిస్ట్రిక్ట్స్ మొదట బ్యాటింగ్ దిగినప్పటికీ.. తొలి 5 వికెట్లు 95 పరుగులకే కోల్పోయింది. అయితే ఆరో నెంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన జో కార్టర్, ఏదో నెంబర్‌లో వచ్చిన బ్రెట్ హాంప్టన్ మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. కార్టర్ 77 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 102 పరుగులు చేయగా.. హాంప్టన్ 66 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 95 పరుగులు చేశాడు. వీరిద్దరూ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. లుడిక్ తన కోటాలో చివరి ఓవర్‌ వేయడానికి 46వ ఓవర్‌లో రాగా.. కార్టర్, హాంప్టన్‌లు చిన్న సైజ్ విధ్వంసం సృష్టించారు.

ఆ ఓవర్ సాగిందిలా…

1st Ball – 4 Runs

2nd Ball – 6 Runs(No Ball)

2nd Ball – 6 Runs(No Ball)

2nd Ball – 6 Runs

3rd Ball – 1 Run

4th Ball – 6 Runs

5th Ball – 6 Runs

6th Ball – 6 Runs

దీనితో విలియం లుడిక్ తన కోటా 10 ఓవర్లలో ఏకంగా 85 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అలాగే ఒక ఓవర్‌లో 43 పరుగుల ఇచ్చి బంగ్లాదేశ్ బౌలర్ అల్లావుద్దీన్ బాబు(2013-14 సీజన్‌లో 39 పరుగులు) లిస్టు-ఏ క్రికెట్‌లో నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ జట్టు 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

జో కార్టర్, బ్రెట్ హాంప్టన్‌ల విధ్వంసంతో నార్తర్న్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 313 పరుగులు చేసింది. ఇక ఈ టార్గెట్‌ను చేధించే క్రమంలో సెంట్రల్ జట్టు ధీటుగా బ్యాటింగ్ చేసింది. డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ అజేయంగా 120 పరుగులు చేసినా.. మిగిలిన బ్యాటర్లు అతడికి సహకారం అందించకపోవడంతో నిర్ణీత ఓవర్లకు సెంట్రల్ జట్టు తొమ్మిది వికెట్లకు 288 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

Also Read:

Dead man’s fingers: భూమి లోంచీ బయటికొచ్చిన చేతి వేళ్లు.. భయంతో వణికిపోయిన జనం.. వీడియో

Viral Video: ఇక్కడ అడుగు పెడితే వందేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది.. వీడియో

Viral Video: సిటీ జీవనం నచ్చక కుటుంబంతో సహా అడవిబాట.. కేవలం అదే తింటూ..! వీడియో

Zodiac Signs: ఈ 3 రాశులవారు ఎలప్పుడూ బిజినెస్ మైండెడ్.! అందులో మీరున్నారా..

తల్లి జీబ్రా సాహసం.. సింహాన్ని వెనుక కాళ్లతో తన్నుతూ.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు.!

మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది