Kapil Dev: భారత జట్టు కంటే ఐపీఎల్‎కు ప్రాధాన్యత ఇచ్చేవాళ్లు ఉన్నారు.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..

జాతీయ జట్టుకు ఆడటం కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్‎కు ప్రాధాన్యత ఇచ్చే ఆటగాళ్లు ఉన్నారని భారత మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ షెడ్యూల్‌ను మెరుగ్గా ప్లాన్ చేయాలని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)ని కోరారు...

Kapil Dev: భారత జట్టు కంటే ఐపీఎల్‎కు ప్రాధాన్యత ఇచ్చేవాళ్లు ఉన్నారు.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
Kapil Dev

జాతీయ జట్టుకు ఆడటం కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్‎కు ప్రాధాన్యత ఇచ్చే ఆటగాళ్లు ఉన్నారని భారత మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ షెడ్యూల్‌ను మెరుగ్గా ప్లాన్ చేయాలని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)ని కోరారు. టీ20 ప్రపంచకప్‌కు వెళ్లే ముందు భారత ఆటగాళ్లు ఐపీఎల్ 2021 రెండో అంచె తర్వాత విశ్రాంతి తీసుకోవాల్సి ఉందన్నారు. ఆటగాళ్లు దేశాన్ని ఫ్రాంచైజీల కంటే ఎక్కువగా ఉంచాలని కపిల్ దేవ్ నొక్కి చెప్పారు. 2012 తర్వాత తొలిసారిగా ఐసీసీ టోర్నమెంట్‌లో నాకౌట్‌కు చేరుకోవడంలో విఫలమవడంతో భారత్ టీ20 ప్రపంచకప్‌ నుంచి ముందుగానే నిష్క్రమించింది.

సోమవారం జరిగే తమ చివరి సూపర్ 12 మ్యాచ్‌లో భారత్ నమీబియాతో తలపడనుంది. గ్రూప్-2 నుంచి పాకిస్తాన్, న్యూజిలాండ్ సెమీస్‎కు వెళ్లాయి. జస్ప్రీత్ బుమ్రాతో సహా పలువురు ఆటగాళ్లు దాదాపు 6 నెలల పాటు రోడ్డుపై ఉన్నామని, మానసికంగా అలసటను చెందామని ఎత్తిచూపారు. భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఆదివారం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

“ఆటగాళ్లు దేశం కోసం ఆడటం కంటే ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, మనం ఏమి చెప్పగలం. ఆటగాళ్లు తమ దేశం కోసం ఆడటం పట్ల గర్వపడాలి. వారి ఆర్థిక పరిస్థితులు నాకు తెలియదు కాబట్టి పెద్దగా చెప్పలేను” అని కపిల్ దేవ్ ఓ వార్త సంస్థతో మాట్లాడారు. “అయితే ముందుగా దేశంలోని జట్టు ఆ తర్వాత ఫ్రాంచైజీలు ఉండాలని నేను భావిస్తున్నాను. అక్కడ (ఐపీఎల్) క్రికెట్ ఆడకూడదని నేను చెప్పడం లేదు, కానీ ఇప్పుడు క్రికెట్‌ను మరింత మెరుగ్గా ప్లాన్ చేయాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉంది.” చెప్పాడు. భారత్ ప్రపంచ కప్ నిష్క్రమణ తర్వాత దిగులు చెందాల్సిన అవసరం లేదని, రాబోయే ప్రధాన టోర్నమెంట్‌ల కోసం ఆటగాళ్లను తీర్చిదిద్దే ప్రణాళికను బీసీసీఐ ప్రారంభించాలని కపిల్ సూచించాడు.

“ఇది భవిష్యత్తును చూడవలసిన సమయం. మీరు వెంటనే ప్లాన్ చేయడం ప్రారంభించండి. వెళ్లి ప్లాన్ చేయండి. ఐపీఎల్ మధ్య కొంత గ్యాప్ ఉందని నేను భావిస్తున్నాను. ఈ రోజు మన ఆటగాళ్లపై భారీ అంచనాలు, కానీ వారు దానిని ఎక్కువగా రాణించలేకపోతున్నారు” చెప్పాడు. సోమవారం నాటి సూపర్ 12 మ్యాచ్ తర్వాత అతని పదవీకాలం ముగియనున్న తరుణంలో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఐపీఎల్, టీ 20 ప్రపంచ కప్ మధ్య విరామం ఆటగాళ్లకు సహాయపడుతుందని చెప్పాడు.

Read Also.. T20 World Cup 2021: అక్తర్‌పై రూ.10 కోట్ల నష్ట పరిహారం కేసు.. దిగ్గజ బౌలర్ కు నోటీసులు పంపిన పాక్‌ ఛానెల్‌..

Published On - 2:44 pm, Mon, 8 November 21

Click on your DTH Provider to Add TV9 Telugu