Covid Vaccine: బ్రిటన్‌కు వెళ్లే భారత ప్రయాణికులకు శుభవార్త.. కోవాగ్జిన్ తీసుకున్నవారికి అనుమతి.. ఎప్పటి నుంచి అంటే?

భారత్ కొవిషిల్డ్, కోవాగ్జిన్ వంటి వ్యాక్సిన్లను అభివృద్ధి చేసింది. అయితే, కొన్ని దేశాల్లో స్వదేశీయంగా తయారైన టీకాలపై ఆంక్షలు విధించాయి

Covid Vaccine: బ్రిటన్‌కు వెళ్లే భారత ప్రయాణికులకు శుభవార్త.. కోవాగ్జిన్ తీసుకున్నవారికి అనుమతి.. ఎప్పటి నుంచి అంటే?
Covaxin
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 09, 2021 | 3:31 PM

Covid-19 Vaccine: ఏళ్లు గడుస్తున్న కరోనా మహమ్మారికి కట్టడి పడటంలేదు.. చాప కింద నీరులా వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. కోవిడ్ నియంత్రణలో భాగంగా అయా దేశాలు వివిధ రకాల వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్ కొవిషిల్డ్, కోవాగ్జిన్ వంటి వ్యాక్సిన్లను అభివృద్ధి చేసింది. అయితే, కొన్ని దేశాల్లో స్వదేశీయంగా తయారైన టీకాలపై ఆంక్షలు విధించాయి. తాజాగా అంతర్జాతీయ రాకపోకలను సులభతరం చేసేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలు వెలువరించింది. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ‘గుర్తించిన కొవిడ్‌ టీకాల జాబితా’లో భారత్‌కు చెందిన కొవాగ్జిన్‌ను చేర్చుతున్నట్లు ప్రకటించింది. ఈ టీకా తీసుకున్నవారిని నవంబర్‌ 22 నుంచి అనుమతించాలని నిర్ణయించింది. అయితే, బ్రిటన్‌కు చేరుకున్న తర్వాత ఐసొలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ను ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర వినియోగ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. యూకే ప్రభుత్వం ఇదివరకే కొవిషీల్డ్‌ను గుర్తించింది. తాజాగా కొవిడ్‌ టీకాల జాబితా’లో భారత్‌కు చెందిన కొవాగ్జిన్‌ను చేర్చుతున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ బ్రిటిష్‌ హైకమిషనర్ అలెక్స్ ఎలిస్‌ సైతం ట్వీట్‌ చేశారు. ‘బ్రిటన్‌కు వచ్చే భారత ప్రయాణికులకు మరో శుభవార్త. నవంబరు 22 నుంచి కొవాగ్జిన్‌తోసహా డబ్ల్యూహెచ్‌వో అత్యవసర వినియోగానికి గుర్తించిన టీకాలు వేసుకొని ఇక్కడికి చేరుకున్నాక ఐసొలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 22 తెల్లవారుజామున 4 గంటల నుంచి అమల్లోకి రానుంది. ఈ సందర్భంగా బ్రిటన్‌ ప్రభుత్వం.. కొవాగ్జిన్‌తోపాటు చైనాకు చెందిన సినోవాక్, సినోఫార్మ్‌లనూ గుర్తించింది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్‌ పూర్తయిన ప్రయాణికులు బయలుదేరడానికి ముందు, వచ్చాక ఎనిమిది రోజులకు పరీక్ష చేయించుకోవడం, ఐసొలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదు.

Read Also… Tulasi Gowda: వన సామ్రాజ్య సృష్టికర్త తులసమ్మను వరించిన పద్మ శ్రీ.. ప్రధానినే ఆకర్షించిన ఈ 72 ఏళ్ల మహిళ ఎవరంటే..