AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Global COVID-19 cases: ప్రపంచాన్ని శనిలా వెంటాడుతున్న కరోనా.. పలు దేశాల్లో పెరుగుతున్న పాజిటివ్ కేసులు

Global COVID-19 cases: ప్రపంచ దేశాల పాలిట కరోనా వైరస్ శనిలా మారింది. తగ్గినట్టే తగ్గి కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. 

Global COVID-19 cases: ప్రపంచాన్ని శనిలా వెంటాడుతున్న కరోనా.. పలు దేశాల్లో పెరుగుతున్న పాజిటివ్ కేసులు
covid cases
Janardhan Veluru
|

Updated on: Nov 09, 2021 | 1:50 PM

Share

Global COVID-19 cases: ప్రపంచ దేశాల పాలిట కరోనా వైరస్ శనిలా మారింది. తగ్గినట్టే తగ్గి కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు(నవంబరు 8నాటి వరకు) నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25 కోట్లను దాటింది. అత్యధికంగా అమెరికాలో 4.6 కోట్ల కేసులు నమోదుకాగా.. భారత్‌లో 3.43  కోట్ల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. డెల్లా వెరియంట్‌ ప్రభావంతో వివిధ దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. వ్యాక్సినేషన్‌ ప్రభావంతో మొదట్లో కేసులు తగ్గగా.. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గత మూడు మాసాలుగా రోజువారీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 36శాతం తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే ప్రతి 90 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల మంది డెల్టా వేరియంట్ బారినపడుతున్నారు.

యూరప్‌లోని పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సరిగ్గా జరలేదు. దీంతో  కరోనా పాజిటివ్‌ కేసులు లక్షల సంఖ్యలో నమోదవుతున్నాయి. యూరప్‌లో నాలుగు నెలల్లో 10 లక్షలు, రష్యాలో 88 లక్షల పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. రష్యాలో ప్రతీ రోజు వేయి మందికి పైగా కరోనా బారినపడి మృతి చెందుతున్నారు. దీంతో  రష్యా ప్రభుత్వం అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7 వరకు హాలీడే ప్రకటించింది. నవంబర్‌ 8 నుంచి ఉద్యోగులు యథావిధిగా విధులకు హజరవుతున్నారు. ఇప్పటికీ కరోనా కేసులు తగ్గటం లేదంటూ పలువురి ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆ దేశంలో సోమవారం 39,400 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,190 మంది మృతి చెందారు.

జర్మన్‌లో… జర్మన్‌లో గత 15 నెలలుగా కరోనా కేసుల సంఖ్య మందగించింది. ఇప్పటికే ఆ దేశంలో 74 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేశారు. అయితే నవంబర్‌ మాసం నుంచి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ నెల మొదటి వారంలో ప్రతీ లక్ష మందిలో 201 మంది కరోనా వైరస్‌ బారిన పడినట్లు అధికారుల వెల్లడించారు.  నవంబర్‌ 8న 15,513 మంది కోవిడ్‌ బారిన పడ్డారు.

చైనాలో.. చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తి మళ్ళీ పెరిగింది. వూహాన్‌లో కేసుల సంఖ్య బాగా పెరుగుతున్నాయి. కోవిడ్‌ ఆంక్షలను చైనా ప్రభుత్వం మరింత కఠినం చేసింది.

పలు దేశాలు లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేయడం,  విదేశీయుల పర్యటనలకు సంబంధించి ట్రావెల్ ఆంక్షలు ఎత్తివేయడం, వాణిజ్య కార్యకలాపాలు, టూరిజం పుంజుకోవడం వంటి అంశాలు కోవిడ్ కేసులు మళ్లీ పెరగడానికి కారణంగా తెలుస్తోంది.

Also Read..

Personal Loan: తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలు.. రూ.5 లక్షల రుణంపై ఎంత వడ్డీ.. నెలకు EMI.. పూర్తి వివరాలు

Telangana-Tiger Fear: తెలంగాణను బెంబేలెత్తిస్తున్న బెబ్బులి.. ములుగు జిల్లాలో పశువుల మందపై పులి అటాక్..