Personal Loan: తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలు.. రూ.5 లక్షల రుణంపై ఎంత వడ్డీ.. నెలకు EMI.. పూర్తి వివరాలు
Personal Loan: ప్రస్తుతం బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని రకరకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి..
Personal Loan: ప్రస్తుతం బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని రకరకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి బ్యాంకులు. వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తూ వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత చాలా మంది ఆర్థికంగా కుంగిపోయారు. దీంతో వారు బ్యాంకు రుణాల వైపు చూస్తున్నారు. వ్యక్తిగత రుణాలను తీసుకుని ఆర్థిక ఇబ్బందులను తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా వ్యక్తిగత రుణాలను ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. ఏయే బ్యాంకులు ఎంత వడ్డీతో రుణాలను ఇస్తున్నాయో చూద్దాం.
యూనియన్ బ్యాంకులో వ్యక్తిగత రుణం తక్కువ వడ్డీ రేటుకు పొందవచ్చు. వడ్డీ రేటు 8.9 శాతం నుంచి మొదలవుతుంది. ఐదు సంవత్సరాల కాలపరిమితితో ఈఎంఐ పద్దతిలో చెల్లించుకోవచ్చు. అయితే రూ.5 లక్షల రుణం తీసుకుంటే రూ.10,355 ఈఎంఐ ద్వారా చెల్లించవచ్చు. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకులో అయితే 8.95 శాతంగా వడ్డీ పడుతుంది. అలాగే ఐసీఐసీ బ్యాంకులో 10.5 శాతం, ఎస్‌బీఐలో 9.6 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 10 శాతం, ఐడీబీఐ 9.6 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 10.25 శాతం వడ్డీరేటు ప్రారంభం అవుతుంది. యస్ బ్యాంకులో 10.40 శాతం. ఇక రూ.5 లక్షల రుణంపై ఐదు సంవత్సరాల పాటు ఎంత ఈఎంఐ ఎంత చెల్లించాలో కొన్ని బ్యాంకులను మీకు తెలియజేస్తున్నాము.
► యూనియన్ బ్యాంకు 8.90 శాతం వడ్డీ రేటుతో నెలకు రూ.10,355
► సెంట్రల్ బ్యాంకు 8.90 శాతం వడ్డీ రేటుతో నెలకు రూ.10.355
► పంజాబ్ నేషనల్ బ్యాంకు 8.95 శాతం వడ్డీతో నెలకు రూ.10.367
► ఇండియన్ బ్యాంకు 9.05 శాతం వడ్డీ – నెలకు రూ.10.391
► బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 9.45శాతం వడ్డీ – నెలకు రూ.10.489
► పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ 9.50 వడ్డీ శాతం – నెలకు రూ.10,501
► ఐడీబీఐ బ్యాంకు 9.50 శాతం వడ్డీ- నెలకు రూ.10,501
► ఎస్‌బీఐ 9.60 శాతం వడ్డీ – నెలకు రూ.10,525
► బ్యాంక్ ఆఫ్ బరోడా 10 శాతం వడ్డీ – నెలకు రూ.10,624
► హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 10.25 శాతం వడ్డీ – నెలకు రూ.10,685
► బ్యాంక్ ఆఫ్ ఇండియా 10.35 శాతం – నెలకు రూ.10.710
► ఐసీఐసీఐ బ్యాంకు 10.50 శాతం వడ్డీ – నెలకు రూ.10,747
కాగా, ఈ వివరాలన్ని వివిధ ఫైనాన్స్ వెబ్‌సైట్ల ద్వారా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బ్యాంకు వడ్డీ శాతం, ఈఎంఐలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. మీరు రుణం తీసుకునే సమయానికి అప్పటి వడ్డీరేటు, అప్పటి ఈఎంఐ ఎంత ఉందో అంత చెల్లించుకోవాల్సి ఉంటుంది. లోన్ పొందే ముందు ఆయా బ్యాంకు అధికారులను సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు.
ఇవి కూడా చదవండి: