- Telugu News Photo Gallery Business photos Top ten longest railway station in the world know all about ten biggest rail stations of india indian railways
Railway Stations: ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద రైల్వే స్టేషన్స్ ఏమిటో తెలుసా..? టాప్‌లో 7 భారత్‌కు చెందినవే..!
Biggest Rail Stations: ప్రపంచంలోని పొడవైన రైల్వే స్టేషన్: రైల్వేలు ఉన్న దేశాల్లో ప్రపంచంలోని అగ్రదేశాలలో భారతదేశం పేరు నిలిచిపోయింది..
Updated on: Nov 09, 2021 | 11:02 AM

Biggest Rail Stations: ప్రపంచంలోని పొడవైన రైల్వే స్టేషన్: రైల్వేలు ఉన్న దేశాల్లో ప్రపంచంలోని అగ్రదేశాలలో భారతదేశం పేరు నిలిచిపోయింది. భారత్ నుంచి బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా వరకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో స్టేషన్లు ఉంటాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్‌ఫామ్ ఉన్న స్టేషన్ల విషయానికొస్తే టాప్ 10లో అత్యధిక స్టేషన్లు భారతదేశానికి చెందినవే ఉన్నాయి. పొడవైన ప్లాట్‌ఫామ్ భారతదేశంలోని కర్ణాటకలోని హుబ్లీలో ఉంది.

సిద్ధరూడ స్వామిజీ రైల్వే స్టేషన్ కర్ణాటకలోని హుబ్లీలో ఉంది. నిర్మాణంలో ఉన్న ఈ హుబ్లీ స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ పొడవు 1505 మీటర్లు (4,938 అడుగుల). ఈ స్టేషన్‌లో 8 ప్లాట్ ఫారమ్‌లు ఉన్నాయి. ప్లాట్‌ఫామ్ నంబర్ 1 మరియు 8 పొడవైన ట్రాక్‌ను కలిగి ఉన్నాయి.

రెండవది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నగరమైన గోరఖ్‌పూర్. ఇక్కడ ప్లాట్ ఫాం పొడవు 1366.33 మీటర్లు (4483 అడుగులు). ఇక మూడో స్థానంలో కేరళలోని కొల్లం స్టేషన్ ఉంది. ఇక్కడ ప్లాట్ ఫామ్ పొడవు 1180.5 మీటర్లు (3873 అడుగులు).

పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్ నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడి ప్లాట్‌ఫామ్ పొడవు 1072.5 మీటర్లు (3519 అడుగులు). దీని తర్వాత స్టేట్ స్ట్రీట్ సబ్‌వే ఆఫ్ చికాగో (US) ఐదో స్థానంలో ఉంది. దీని ప్లాట్‌ఫామ్ పొడవు 1067 మీటర్లు (3501 అడుగులు). ఇది ఉత్తర అమెరికాలో పొడవైన ప్లాట్‌ఫామ్‌గా గుర్తింపు ఉంది.

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ రైల్వే జంక్షన్ కూడా ఈ జాబితాలో ఉంది. ఆది ఆరో స్థానంలో ఉంది. దీని పొడవు దాదాపు 900 మీటర్లు (2953 అడుగులు). ఇక యూఎస్‌లోని కాలిఫోర్నియాలో పోంటానా అనే ఆటో క్లబ్ స్పీడ్‌వే స్టేషన్ ఉంది. దీని పొడవు 791 మీటర్లు (2675). ఇది ఐరోపాలోని పొడవైన స్టేషన్‌లలో ఇది ఒకటి.

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ స్టేషన్ 802 మీటర్ల పొడవు (2631 అడుగులు) ఉంది. దీని తర్వాత బ్రిటన్‌కు చెందిన షెరటన్ షటిల్ టెర్మినల్ ఫోక్‌స్టోన్ (UK). దీని ప్లాట్‌ఫాం పొడవు 731 మీటర్లు (2595 అడుగులు)

ఇక ఉత్తరప్రదేశ్‌లోని ఝూన్సీ స్టేషన్ ఉంది. దీని ప్లాట్‌ఫాం పొడవు 770 మీటర్లు (2526 అడుగులు). పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఈస్ట్ పెర్త్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం పొడవు కూడా అంతే. ఇది ఆస్ట్రేలియాలో అతి పొడవైన స్టేషన్‌గా గుర్తింపు ఉంది.





























