- Telugu News Photo Gallery Business photos Public Provident Fund accounts merger government issue guidelines for dealing with such cases
PPF Accounts Merger: ఇక నుంచి ఒకే పీపీఎఫ్ ఖాతా.. అకౌంట్ల విలీనంపై కేంద్రం కీలక మార్గదర్శకాలు
PPF Accounts Merger: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) స్కీమ్ ఖాతాలపై కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పీపీఎఫ్ ఖాతా కింద ఒక వ్యక్తి ఒకే ఖాతాను ..
Updated on: Nov 08, 2021 | 12:51 PM

PPF Accounts Merger: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) స్కీమ్ ఖాతాలపై కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పీపీఎఫ్ ఖాతా కింద ఒక వ్యక్తి ఒకే ఖాతాను ఓపెన్ చేసుకోవాలని సూచించింది.

ఒకవేళ ఇప్పటికే ఒకటి కన్నా ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలు ఉన్నట్లయితే వాటన్నింటిని కూడా విలీనం చేసి ఒకే అకౌంట్ కింద మార్చుకోవాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేస్తూ, విలీనంపై మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలను గుర్తించబోమని కేంద్ర మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఏదైనా పీపీఎఫ్ లోన్ అకౌంట్ ఉన్నట్లయితే విలీనం చేయడానికి ముందు దానిని మూసివేయాల్సి ఉంటుందని తెలిపింది. అయితే ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే ఏ ఖాతాను క్లోజ్ చేయాలో డిపాజిటర్ ఇష్టమని తెలిపింది.

రెండు ఖాతాలు ఉంటే మూసివేసిన అకౌంట్లో ఉన్న మొత్తాన్ని వారు నిర్వహించాలనుకుంటున్న అకౌంట్‌కు బదిలీ చేస్తారు. పోస్టాఫీసులు, బ్యాంకుల ఖాతాలు కొనసాగించాలనుకునే డిపాజిటర్లు పాస్‌బుక్, బ్యాంకు స్టేట్‌మెంట్ కాపీలతో వారికి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. వారు పరిశీలిస్తారు.





























