- Telugu News Photo Gallery Business photos Now misuse Aadhar card can lead up to 1 Crore Rupees fine know about this new UIDAI Rule
Aadhar: ఆధార్ కార్డ్‌ను తప్పుగా ఉపయోగించారా అంతే సంగతులు.. భారీ జరిమానా విధిస్తారు.. జర భద్రం!
ప్రస్తుతం ఆధార్ కార్డు అత్యంత కీలక పత్రంగా మారింది. ప్రస్తుతం ఆధార్ లేకుండా ఏమీ చేయలేం. బ్యాంకు లావాదేవీలు, రుణాలు, ఆర్‌టిఆర్‌లకు పిల్లల పాఠశాలలో ప్రవేశానికి కూడా ఆధార్ కార్డ్ తప్పనిసరి అవసరంగా మారింది.
Updated on: Nov 09, 2021 | 12:38 PM

ఆధార్ కార్డు అవసరం పెరుగుతున్న కొద్దీ దానికి సంబంధించిన మోసాల కేసులు కూడా పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, ఆధార్ సంస్థ యూఐడీఏఐ(UIDAI) కొన్ని కొత్త నిబంధనలను అమలు చేసింది, దీని ప్రకారం ఎవరైనా ఆధార్ కార్డును దుర్వినియోగం చేస్తే, అది అతనికి చాలా ఖరీదైనదిగా మారిపోతుంది.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం (జరిమానాల తీర్పు) రూల్స్ 2021 ద్వారా ఈ నియమాన్ని నోటిఫై చేసింది. ఈ నియమం ప్రకారం అథారిటీ ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించవచ్చు. అధికారి విధించిన జరిమానా మొత్తం యూఐడీఏఐ(UIDAI) ఫండ్‌లో జమ చేస్తారు.

ఈ నిబంధన ప్రకారం ఎవరైనా జరిమానా మొత్తాన్ని చెల్లించలేకపోతే, అతని ఆస్తిని వేలం వేసే అవకాశమూ ఉంది. ఆధార్ కార్డును దుర్వినియోగం చేసే వారిపై చర్య తీసుకునే హక్కు యూఐడీఏఐ(UIDAI)కి ఇప్పుడు లభించింది.

ఆధార్ చట్టాన్ని పాటించని వారిపై కోటి రూపాయల వరకు జరిమానా విధించే అధికారం యూఐడీఏఐ(UIDAI)కి ఉందని భారత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని తర్వాత ఆధార్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై యూఐడీఏఐ(UIDAI) మరింత కఠినంగా వ్యవహరించగలదని చెబుతున్నారు.

దీనికి ముందు, ఆధార్ కార్డును దుర్వినియోగం చేసిన లేదా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునే అధికారాలు UIDAIకి లేవు. ఇప్పుడు కొత్తగా ఈ నిబంధన తీసుకువచ్చినందున ఆధార్ కార్డ్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.





























