Loan Scheme: ఈ బ్యాంకు కొత్త స్కీమ్‌ ప్రారంభించింది.. ఇందులో రూ.50 కోట్ల వరకు రుణ సదుపాయం

Loan Scheme: ప్రస్తుతం బ్యాంకులు రుణాల విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు రుణాల విషయాలలో..

Loan Scheme: ఈ బ్యాంకు కొత్త స్కీమ్‌ ప్రారంభించింది.. ఇందులో రూ.50 కోట్ల వరకు రుణ సదుపాయం
Follow us

|

Updated on: Nov 09, 2021 | 7:54 AM

Loan Scheme: ప్రస్తుతం బ్యాంకులు రుణాల విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు రుణాల విషయాలలో వివిధ స్కీమ్‌లను ప్రవేశపెడుతున్నాయి. తాజాగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మరో స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎంఎస్‌ఎంఈ ఉత్సవ్‌ పేరుతో పథకాన్ని ప్రారంభించింది. పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ స్కీమ్‌ డిసెంబర్‌ 31 వరకు అమల్లో ఉంటుంది. బ్యాంక్‌ వివరాల ప్రకారం.. ఈ స్కీమ్‌ పరిశ్రమలు నడుపుతున్న వారికి ఎంతో ప్రయోనకరంగా ఉంటుంది. తక్కువ వడ్డీలకే ఈ స్కీమ్‌ ద్వారా రుణాలు సొంతం చేసుకోవచ్చు. ఈ మేరకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ట్వీట్‌ చేసింది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఈ ఎంఎస్‌ఎంఈ ఉత్సవ్‌ యోజన కింద రూ.250 కోట్ల వరకు టర్నోవర్‌ ఉన్న పరిశ్రమలు రూ.50 కోట్ల వరకు రుణాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద రుణం తీసుకునేందుకు ప్రాసెసింగ్‌ ఫీజులో వందశాతం రాయితీ ఉంటుందని బ్యాంకు వెల్లడించింది. అలాగే బ్యాంక్ గ్యారెంటీ మరియు లెటర్ ఆఫ్ క్రెడిట్ కమీషన్‌లో 50 శాతం వరకు తగ్గింపు ఇవ్వబడుతోంది. ఈ స్కీమ్‌లో రుణం తీసుకుంటే 6.55 శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభం అవుతుంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అమృత్‌ మహోత్సవ్‌ ఆఫ్‌ ఇండిపెండెన్స్‌ కింద ఈ పథకాన్ని ప్రారంభించింది.

ఇందులో కర్మాగారాలు, భూమి, భవనాల నిర్మాణానికి స్థలాల సేకరణ కోసం ఈ రుణ డబ్బులు ఉపయోగించుకోవచ్చు. అలాగే ల్యాబ్‌ పరికరాలు, టెస్టింగ్‌ పరికరాలు మొదలైన వాటితో సహా ప్లాంట్‌, మెషినరీని కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా స్వయం ఉపాధి కోసం వివిధ రకాల ఉత్పత్తులను అందిస్తుంది. వీటిలో ఎంఎస్‌ఎంఈలు అంటే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలకు వ్యాపార రుణాలు ఉన్నాయి. వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి అధిక క్రెడిట్‌ స్కోర్‌ లేదా సిబిల్‌ స్కోర్‌ కలిగి ఉండాలి. వడ్డీ రేట్లను నిర్ణయిచంచడంలో ఈ స్కోర్‌ సహాయపడుతుంది. అలాగే క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉంటే రుణ దరఖాస్తును తిరస్కరించవచ్చు. లేదా వడ్డీ ఎక్కువగా ఉండవచ్చు. సులభంగా రుణం పొందాలంటే 700 కంటే ఎక్కువ క్రెడిట్‌ స్కోర్‌ను కలిగి ఉండటం మంచిది.

ఇవి కూడా చదవండి:

PM Kisan: దుర్వినియోగం అవుతున్న పీఎం కిసాన్‌ సమ్మాన్‌ స్కీమ్‌.. ఇక్కడ అనర్హులకే బెనిఫిట్‌.. అధికారుల విచారణ

PPF Accounts Merger: ఇక నుంచి ఒకే పీపీఎఫ్‌ ఖాతా.. అకౌంట్ల విలీనంపై కేంద్రం కీలక మార్గదర్శకాలు