ZyCoV-D Vaccine: సూది నొప్పి లేకుండా మన దేశ టీకా.. మొదటి డీఎన్ఏ వ్యాక్సిన్ జైకొవ్-డి ధర నిర్ణయించిన ప్రభుత్వం..ఎంతంటే..
కేంద్ర ప్రభుత్వం ప్రపంచపు మొదటి డీఎన్ఏ వ్యాక్సిన్ జైకొవ్-డి ధర నిర్ణయించింది. ఇది మనదేశంలోనే తయారైన టీకా అంతేకాకుండా దీనిని సూది అవసరం లేకుండా వేస్తారు.
ZyCoV-D Vaccine: జైడస్ కాడిలా కరోనా వ్యాక్సిన్ ధర నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ వ్యాక్సిన్ జైకొవ్-డి(ZyCoV-D) డోస్‌ను రూ.265కి కొనుగోలు చేస్తుంది. మొన్న నవంబర్ 7న ఈ వ్యాక్సిన్ కోటి డోసులను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఏ నేపధ్యంలో దీని ధరను నిర్ణయిస్తూ ప్రకటన జరీ చేసింది ప్రభుత్వం. గుజరాత్‌కు చెందిన ఫార్మా కంపెనీ జైడస్ కాడిలా చెబుతున్న దాని ప్రకారం, ఈ వ్యాక్సిన్‌ను సూదికి బదులుగా జెట్ ఇంజెక్టర్‌తో ఇంజెక్ట్ చేస్తారు. జెట్ ఇంజెక్టర్ ఒక్కో డోసుకు రూ.93 చొప్పున ఇస్తారు. ఇందులో జీఎస్టీ ఉండదు. త్వరలో ఈ వ్యాక్సిన్‌ను దేశ వ్యాక్సినేషన్ ప్రచారంలో భాగం చేయవచ్చని భావిస్తున్నారు. నివేదిక ప్రకారం, జైకొవ్-డి (ZyCoV-D) వ్యాక్సిన్ మొదట్లో పెద్దలకు ఇస్తారు. జైకొవ్-డి(ZyCoV-D) దేశీయంగా తయారు చేసిన మూడు-డోస్ సూది-రహిత టీకా. అదేవిధంగా, కరోనాకు వ్యతిరేకంగా డీఎన్ఏ(DNA) ఆధారంగా రూపొందించిన మొదటి వ్యాక్సిన్ ఇదే.
Zycov-D సూది రహిత వ్యాక్సిన్..
ఈ టీకా సూదికి బదులుగా జెట్ ఇంజెక్టర్‌తో అందిస్తారు. జెట్ ఇంజెక్టర్లను అమెరికాలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల అధిక పీడనంతో వ్యక్తుల చర్మంలోకి వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. అదే సమయంలో, సాధారణంగా ఉపయోగించే సూది లేకుండానే, ద్రవం లేదా ఔషధం కండరాలలోకి వెళుతుంది. జెట్ ఇంజెక్టర్లలో ఒత్తిడికి సంపీడన వాయువు లేదా స్ప్రింగ్లను ఉపయోగిస్తారు. జెట్ ఇంజెక్టర్‌తో వ్యాక్సిన్‌ను ఇంజెక్ట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? మొదటి ప్రయోజనం ఏమిటంటే అది పొందుతున్న వ్యక్తికి నొప్పిని తగ్గిస్తుంది. ఎందుకంటే ఇది సాధారణ ఇంజెక్షన్ లాగా మీ కండరాల లోపలికి వెళ్లదు. రెండవ ప్రయోజనం ఏమిటంటే, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం సూది ఇంజెక్షన్ కంటే చాలా తక్కువగా ఉంటుంది.
ప్రపంచంలోని మొట్టమొదటి DNA-ఆధారిత వ్యాక్సిన్
Zycov-D, DNA-ప్లాస్మిడ్ వ్యాక్సిన్. ఈ టీకా శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి జన్యు పదార్థాన్ని ఉపయోగిస్తుంది. యుఎస్‌తో సహా అనేక దేశాల్లోని ఫైజర్..మోడర్నా వ్యాక్సిన్‌లు రోగనిరోధక శక్తిని పెంచడానికి mRNAని ఉపయోగించినట్లు, అదే విధంగా ఇది ప్లాస్మిడ్-DNAని ఉపయోగిస్తుంది.
ఇవి కూడా చదవండి: Hospital Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. నలుగురు చిన్నారుల మృతి
లండన్‌లో ఎంబీఏ చేసి ఇండియాలో డెయిరీ ఫామ్ పెట్టాడు.. ఇప్పుడు లక్షలు గడిస్తున్నాడు..