Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani’s house: ముఖేశ్‌ అంబానీ నివాసం వద్ద అలజడి.. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్స్‌తో కలకలం!

రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ నివాసాన్ని ఆగంతకులు మళ్లీ టార్గెట్‌ చేశారు. ఇద్దరు వ్యక్తులు అంబానీ నివాసం గురించి వివరాలు అడిగారని, వాళ్ల దగ్గర బ్యాగులు ఉన్నాయని పోలీసులకు ఓ ట్యాక్సీ డ్రైవర్‌ ఫోన్‌ చేయడంతో ముంబైలో హైఅలర్ట్‌ ప్రకటించారు.

Mukesh Ambani's house: ముఖేశ్‌ అంబానీ నివాసం వద్ద అలజడి.. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్స్‌తో కలకలం!
Mukesh Ambani's House Antilia
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 08, 2021 | 7:55 PM

Mukesh Ambani’s house: రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ నివాసాన్ని ఆగంతకులు మళ్లీ టార్గెట్‌ చేశారు. ఇద్దరు వ్యక్తులు అంబానీ నివాసం గురించి వివరాలు అడిగారని , వాళ్ల దగ్గర బ్యాగులు ఉన్నాయని పోలీసులకు ఓ ట్యాక్సీ డ్రైవర్‌ ఫోన్‌ చేయడంతో ముంబైలో హైఅలర్ట్‌ ప్రకటించారు. అంబానీ నివాసం దగ్గర భద్రతను పెంచారు.

ముంబైలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ నివాసం అలజడి చెలరేగింది. అంబానీ నివాసం అంటిల్లాను గుర్తు తెలియని వ్యక్తులు టార్గెట్‌ చేయడం సంచలనం రేపింది. దీంతో ముంబైలో హైఅలర్ట్‌ ప్రకటించారు. రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ నివాసం అంటిల్లా దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ముంబై డీసీపీకి అనుమానాస్పద ఫోన్ కాల్స్ రావ‌డంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ఫోన్ కాల్ చేసింది ఒక ట్యాక్సీ డ్రైవ‌ర్ అని తేలింది. ఇద్దరు వ్యక్తులు అంబానీ నివాసానికి సంబంధించిన లొకేషన్‌ కావాలని కోరారని, వాళ్లిద్దరి దగ్గర పెద్ద బ్యాగ్‌ ఉందని ఆ ట్యాక్సీ డ్రైవర్‌ పోలీసులకు తెలిపాడు. అంబానీ ఇంటి వ‌ద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ల‌ను పోలీసులు స‌మీక్షిస్తున్నారు. డీసీపీ స్థాయి అధికారి ప్రస్తుతం అంబానీ ఇంటి వ‌ద్ద ప‌రిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

కాగా, ముకేష్ నివాసం వద్ద పరిస్థితిని డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆంటెల్లా నివాసం చుట్టూ భద్రతను పెంచడంతో పాటు అదనపు బారికేడ్లు ఏర్పాటు చేశారు. సీసీటీవీలతో నిఘా ఉంచారు. ముంబైలో ఇద్దరు వ్యక్తుల కోసం పోలీసులు నాకాబందీ నిర్వహిస్తున్నారు. ఇద్దరు అనుమానితుల కోసం గాలిస్తున్నారు. అంటిల్లా దగ్గర పోలీసు కమెండోలతో పాటు అదనపు బలగాలను మొహరించారు. గతంలో కూడా అంబానీ నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. మాజీ పోలీసు అధికారి సచిన్‌ వాజేను ఎన్‌ఐఏ ఈ కేసులో అరెస్ట్‌ చేసింది. అంబానీ నివాసం ముందు పేలుడు పదార్ధాలు ఉన్న స్కార్పియోను సచిన్‌ వాజే పార్కింగ్‌ చేసినట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. అంబానీని బెదిరించడానికే ఈ కుట్ర చేసినట్టు గుర్తించారు. అయితే ఈసారి ముఖేశ్‌ అంబానీ నివాసాన్ని ఎవరు టార్గెట్‌ చేశారన్న విషయంపై సస్పెన్స్‌ నెలకొంది. దర్యాప్తులో అన్ని విషయాలు వెల్లడవుతాయని పోలీసులు అంటున్నారు.

Read Also… 5 లక్షలకు మించి బ్యాంకులో డబ్బులు పెడుతున్నారా..! అయితే ఇలాంటి నష్టాలు కూడా ఉంటాయి..?