Hyderabad: పాతబస్తీలో దారుణం.. అర్ధనగ్నంగా లేడీ డ్యాన్సర్ మృతదేహం.. పక్కనే బీరు బాటిల్..!

ఆర్కెస్ట్రా ట్రూప్‌లో డ్యాన్సర్‌గా పనిచేస్తున్న మహిళ అర్థనగ్నంగా అనుమానస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

Hyderabad: పాతబస్తీలో దారుణం.. అర్ధనగ్నంగా లేడీ డ్యాన్సర్ మృతదేహం.. పక్కనే బీరు బాటిల్..!
Women Death
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 08, 2021 | 7:39 PM

ఆర్కెస్ట్రా ట్రూప్‌లో డ్యాన్సర్‌గా పనిచేస్తున్న మహిళ అర్ధనగ్నంగా అనుమానస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనా స్థలిలో బీర్ బాటిల్ లభ్యం కావడంతో పాటు, డ్యాన్సర్ గొంతుకు గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఫలక్‌నుమా ఇన్‌స్పెక్టర్ దేవేందర్ కథనం ప్రకారం.. ముస్తఫా నగర్‌కు చెందిన శరీన్ ఫాతిమా (30), నదీమ్‌లు భార్యాభర్తలు. వీరికి ఆరుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. భర్త నదీమ్ ఏడాది కిందట మృతి చెందాడు. ఏడుగురు సంతానాన్ని ఆర్కెస్ట్రా ట్రూప్ డ్యాన్సర్‌గా పనిచేస్తూ తల్లి శరీన్ ఫాతిమానే పోషించుకునేది.

రెండు రోజుల కిందటే అద్దె ఇంటిని ఖాళీ చేసింది. మరోచోటుకు ఇంట్లోని వస్తువులు తరలించేందుకు తన పిల్లలను కాస్త దూరంలో ఉన్న నాయనమ్మ ఇంటికి పంపించింది. సామాన్లు షిఫ్ట్ చేసేందుకు వెళ్లి పాత ఇంటికి వెళ్లిన శరీన్ ఫాతిమా ఎంతకూ రాకపోవడంతో నాయనమ్మ ఇంటి నుంచి పిల్లలు తల్లి కోసం వచ్చారు. ఆ సమయంలో తల్లి అర్థ నగ్నంగా కదలకుండా పడిపోయి ఉంది. పిల్లలు ఏడుస్తూ వెళ్లి నాయనమ్మకు విషయం చెప్పారు. ఆమె స్థానికుల సహాయంతో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో శరీన్ ఫాతిమా ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినదని ఫలక్‌నుమా పోలీసులకు సమాచారమిచ్చింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. శరీన్ ఫాతిమా మెడకు బలమైన గాయాలు ఉన్నట్టు గుర్తించారు. అంతేకాకుండా ఘటనా స్థలిలో బీరు బాటిల్ ఉన్నట్టు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఏడాదిన్నరలోపే తల్లిదండ్రులను కోల్పోయి ఏడుగురు పిల్లలు అనాధలయ్యారు. డ్యాన్సర్ ఫాతిమా హత్యకు గురయ్యారా? లేదా ఆత్మహత్యా..? అన్న కోణంలో ఫలక్‌నుమా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నూర్ మహమ్మద్,  హైదరాబాద్

Also Read:  విడాకుల అంశంపై సంచలన పోస్ట్ పెట్టి.. వెంటనే డిలీట్ చేసిన పూనమ్ కౌర్