AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 లక్షలకు మించి బ్యాంకులో డబ్బులు పెడుతున్నారా..! అయితే ఇలాంటి నష్టాలు కూడా ఉంటాయి..?

Cash Deposit Bank: బ్యాంకులలో రూ.5 లక్షల కంటే ఎక్కువ నిల్వ ఉంచకూడదనే అపోహ ప్రజల్లో ఉంది. అయితే బ్యాంకు మాత్రం ఎటువంటి నిబంధనలు విధించలేదు.

5 లక్షలకు మించి బ్యాంకులో డబ్బులు పెడుతున్నారా..! అయితే ఇలాంటి నష్టాలు కూడా ఉంటాయి..?
uppula Raju
|

Updated on: Nov 08, 2021 | 7:50 PM

Share

Cash Deposit Bank: బ్యాంకులలో రూ.5 లక్షల కంటే ఎక్కువ నిల్వ ఉంచకూడదనే అపోహ ప్రజల్లో ఉంది. అయితే బ్యాంకు మాత్రం ఎటువంటి నిబంధనలు విధించలేదు. ఎంత డబ్బు కావాలంటే అంత పెట్టుకోవచ్చని చెబుతోంది. తాజాగా ఇప్పుడు డిపాజిట్లపై హామీ పథకం కూడా ప్రారంభమైంది. దీని ప్రకారం బ్యాంకు మునిగిపోయినా లేదా దివాళా తీసినా ప్రభుత్వం మీకు 5 లక్షల రూపాయలు ఇస్తుంది.

డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ కింద హామీ ఇస్తుంది. మీరు బ్యాంకుల్లో కావలసినంత డబ్బును ఉంచుకోవచ్చు కానీ ఎక్కువ డబ్బు ఉంచడం వల్ల రెండు నష్టాలు ఉంటాయి. ఎక్కువ డబ్బు ఉంచుకోవడం వల్ల ఆదాయపు పన్ను దృష్టిలో పడవచ్చు. అయితే దీని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియనప్పుడు మాత్రమే ఆదాయపు పన్ను నోటీసు ఇస్తుంది.

1. ఎక్కువ డబ్బు డిపాజిట్ చేయడం వల్ల కలిగే నష్టాలు మీరు ఏడాదిలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే దానిపై ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నలు అడగవచ్చు. ఈ నేపథ్యంలో బ్యాంకులో ఎక్కువ డబ్బులు పెట్టకూడదని చెబుతున్నారు. ఒక సంవత్సరంలో 10 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు చేయకూడదు. అలాగే 10 లక్షల కంటే ఎక్కువ విత్‌డ్రా చేయలేరు. మీరు ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే మీరు ఆదాయపు పన్ను నోటీసు పరిధిలోకి రావచ్చు.

2. ఆదాయపు పన్ను భయం వాస్తవానికి మీరు మీ సేవింగ్స్ ఖాతాలో10 లక్షల రూపాయల లావాదేవీని చేసిన వెంటనే మీ పాన్ కార్డ్ ద్వారా ఆదాయపు పన్ను శాఖకు వెళతారు. మీ బ్యాంక్ ఖాతా పాన్‌కి లింక్ చేయబడి ఉంటుంది. మీ ఖాతా పాన్‌తో లింక్ చేయకపోయినా కూడా బ్యాంకు ద్వారా ఆదాయపు పన్ను శాఖకు సమాచారం తెలుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఖాతాలో డబ్బు చిక్కుకుపోయే అవకాశాలు పెరుగుతాయి.

3. డిపాజిట్లపై తక్కువ వడ్డీ ఖాతాలో ఎక్కువ డబ్బు ఉంచుకోవడం వల్ల మరో పెద్ద ప్రతికూలత ఏంటంటే వడ్డీ రేటు చాలా తక్కువ. ద్రవ్యోల్బణం రేటు పొదుపు ఖాతాలో వడ్డీని మించి ఉంటే మీ పొదుపులు మైనస్‌లోకి వెళ్తాయి. బ్యాంకులో డిపాజిట్ చేసిన మొత్తంపై మీకు చాలా తక్కువ రేటుతో వడ్డీని చెల్లిస్తారు. ఇది దాదాపు 2.5 శాతం నుంచి 5 శాతం వరకు ఉంటుంది.

Calcium Foods: మీకు పాలు నచ్చకపోతే కాల్షియం అధికంగా ఉండే ఈ ఆహారాలు తినండి..!

Adimulapu Suresh: ఏపీ విద్యా సంస్కరణలు దేశానికే ఆదర్శం.. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తే ఊరుకునేదీలేదుః సురేష్

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట లెటేస్ట్ అప్డేట్..  చివరిలో దశలో షూటింగ్.. లాస్ట్ షెడ్యూల్ ఎక్కడంటే..