AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Calcium Foods: మీకు పాలు నచ్చకపోతే కాల్షియం అధికంగా ఉండే ఈ ఆహారాలు తినండి..!

Calcium Foods: కాల్షియం శరీరంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. పెద్దలకు సిఫార్సు చేయబడిన రోజువారీ కాల్షియం ప్రతి రోజు 1,000 మిల్లీగ్రాములు. అయినప్పటికీ

Calcium Foods: మీకు పాలు నచ్చకపోతే కాల్షియం అధికంగా ఉండే ఈ ఆహారాలు తినండి..!
Calcium Foods
uppula Raju
|

Updated on: Nov 08, 2021 | 7:48 PM

Share

Calcium Foods: కాల్షియం శరీరంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. పెద్దలకు సిఫార్సు చేయబడిన రోజువారీ కాల్షియం ప్రతి రోజు 1,000 మిల్లీగ్రాములు. అయినప్పటికీ 50 ఏళ్లు పైబడిన మహిళలు 70 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ 1,200 మిల్లీగ్రాములు తీసుకోవాలి. అయితే 4-18 ఏళ్ల వయస్సు పిల్లలు 1,300 మిల్లీగ్రాముల కాల్షియం తీసుకోవాలి. అయితే పాలు మాత్రమే ఈ అవసరాన్ని తీర్చగలవని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. కాల్షియం పుష్కలంగా ఉండే అనేక ఆహారాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకుందాం.

1. కిడ్నీ బీన్స్ 100 గ్రాముల పచ్చి కిడ్నీ బీన్స్‌లో 140 mg కాల్షియం ఉంటుంది. ఇది మానవ శరీరానికి చాలా మంచిది. జీర్ణవ్యవస్థ ఒత్తిడిని తగ్గించడానికి సులభంగా జీర్ణం కావడానికి ఉడకబెట్టి తీసుకోవాలి.

2. బాదం 100 గ్రాముల బాదంపప్పులో 60 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇందులో మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇది శరీర పెరుగుదలకు మంచిది.

3. అంజీర్ 8 అత్తి పండ్లలో 241 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

4. పొద్దుతిరుగుడు విత్తనాలు ఒక కప్పు సన్‌ఫ్లవర్ సీడ్ కెర్నల్స్‌లో 109 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఈ విత్తనాలలో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కాల్షియం ప్రభావాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

5. నువ్వుల గింజలు ప్రతిరోజూ 1 టేబుల్ స్పూన్ నువ్వులు తింటే మంచిది. ఎందుకంటే ఇది మీ రోజువారీ పోషక అవసరాలను తీర్చడానికి 88 మిల్లీగ్రాముల కాల్షియంను జోడిస్తుంది. నువ్వులలో జింక్, రాగి పుష్కలంగా ఉంటుంది.

6. బ్రోకలీ ఒక కప్పు బ్రోకలీలో 87 mg కాల్షియం ఉంటుంది. బ్రోకలీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రాశయం, రొమ్ము, పెద్దప్రేగు, కాలేయం, కడుపు క్యాన్సర్‌ రాకుండా ఉంటుంది.

7. ఈ ఆహారాలు మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కాల్షియం అధికంగా ఉండే ఈ ఆహారాలు మీకు సరైన పోషకాహారాన్ని అందించడానికి పని చేస్తాయి. అందుకే డైట్‌లో చేర్చుకోవడం ముఖ్యం.

మీరు US వెళ్లేందుకు సిద్దమవుతున్నారా..! అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోండి..

Viral Photos: ఈ బండరాయి మిస్టరీ ఇప్పటికీ వీడలేదు.. చూస్తే మీరు ఆశ్చర్యపోతారు..

Manipur Elections 2022: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‎కు షాక్.. బీజేపీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు..