AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు US వెళ్లేందుకు సిద్దమవుతున్నారా..! అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోండి..

US Travel Rules: ఏడాదిన్నర క్రితం కరోనా వైరస్ వల్ల అమెరికా తన సరిహద్దులను మూసివేసింది. బ్రెజిల్, చైనా, భారతదేశం, దక్షిణాఫ్రికా, బ్రిటన్, ఐరోపా ఇలా చాలా దేశాల

మీరు US వెళ్లేందుకు సిద్దమవుతున్నారా..! అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోండి..
Us Travel Rules
uppula Raju
|

Updated on: Nov 08, 2021 | 7:06 PM

Share

US Travel Rules: ఏడాదిన్నర క్రితం కరోనా వైరస్ వల్ల అమెరికా తన సరిహద్దులను మూసివేసింది. బ్రెజిల్, చైనా, భారతదేశం, దక్షిణాఫ్రికా, బ్రిటన్, ఐరోపా ఇలా చాలా దేశాల ప్రయాణికుల రాకని నిషేధించింది. తరువాత వ్యాక్సిన్‌ రావడంతో పరిమితులను విధించింది. సోమవారం నుంచి కొన్ని దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్ రద్దు చేసింది.US ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణికులను దేశంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. అయితే కొన్ని షరతులు వర్తిస్తాయి. వారు తప్పనిసరిగా టీకాలు వేయించుకొని ఉండాలి. కెనడా, మెక్సికోలతో భూ సరిహద్దులను కూడా తిరిగి తెరుస్తోంది. ఈ పరిస్థితులలో అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం.

1. అమెరికా వెళ్లాలంటే నిబంధనలు విదేశీ పౌరులందరికీ విమానం ఎక్కే ముందు పూర్తిగా టీకాలు వేయడం తప్పనిసరి. అదే సమయంలో మునుపటిలాగే ప్రయాణీకులు అమెరికా ప్రయాణానికి 72 గంటల ముందు కోవిడ్ నెగిటివ్‌ రిపోర్ట్‌ని చూపించవలసి ఉంటుంది.

2. ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలి USకి వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాలి.18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టీకాలు వేయాల్సిన అవసరం లేదు. కానీ వారు కోవిడ్ పరీక్ష చేయించుకోవలసి ఉంటుంది. రెండేళ్లలోపు పిల్లలకు కోవిడ్ పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చారు.

3. టీకా నియమాలను ఎవరు అమలు చేస్తారు.. నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యత ఎయిర్‌లైన్స్‌పై ఉంటుంది. ఎయిర్‌లైన్స్ వ్యాక్సిన్ రికార్డ్‌ను ధృవీకరించాలి. వారి IDతో సరిపోల్చాలి. ఎయిర్‌లైన్స్ అలా చేయడంలో విఫలమైతే ఒక్కో ఉల్లంఘనకు $35,000 వరకు జరిమానా విధించవచ్చు. కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం విమానయాన సంస్థలు ప్రయాణీకుల సమాచారాన్ని కూడా సేకరిస్తాయి.

4. ఏ వ్యాక్సిన్ వేసుకొని ఉండాలి.. యుఎస్‌లో ఉపయోగించే ఫైజర్, మోడర్నా, జాన్సన్ & జాన్సన్‌లతో సహా అత్యవసర ఉపయోగం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన ఏదైనా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకొని ఉండాలి. ఇది కాకుండా ఆస్ట్రాజెనెకా, చైనా సినోవాక్ వ్యాక్సిన్ కూడా వేసుకోవచ్చు. అయితే రష్యాకి చెందిన స్పుత్నిక్ V వ్యాక్సిన్‌ వేసుకున్నవాళ్లకి అనుమతి లేదు.

Viral Photos: ఈ బండరాయి మిస్టరీ ఇప్పటికీ వీడలేదు.. చూస్తే మీరు ఆశ్చర్యపోతారు..

SIDBI Recruitment: స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. భారీగా వేతనం పొందే ఛాన్స్..

Samantha: ‘నీలాంటి వ్యక్తి లైఫ్‌లో ఉండటం నా అదృష్టం’.. సమంత ఎమోషనల్ పోస్ట్