- Telugu News Photo Gallery Viral photos Mystery of balancing rock of jabalpur people did not move in massive earthquake
Viral Photos: ఈ బండరాయి మిస్టరీ ఇప్పటికీ వీడలేదు.. చూస్తే మీరు ఆశ్చర్యపోతారు..
Viral Photos: ప్రపంచంలో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. శాస్త్రవేత్తలు కూడా నిర్ధారణకు రాలేకపోయారు.
Updated on: Nov 08, 2021 | 6:46 PM

ప్రపంచంలో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. శాస్త్రవేత్తలు కూడా నిర్ధారణకు రాలేకపోయారు. అలాంటి అద్భుతాలలో ఒకటి మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఉన్న 'బ్యాలెన్సింగ్ రాక్'.

22 మే 1997న జబల్‌పూర్‌లో పెద్ద భూకంపం సంభవించింది. ఇది జబల్‌పూర్‌లో పెను విధ్వంసం సృష్టించింది. భూకంపం ధాటికి పలు భవనాలు నేలకొరిగాయి. కానీ ఈ రాయి ఇంచుకూడ కదలలేదు.

ఈ భూకంపం తీవ్రత 6.2గా నమోదైంది. కానీ ఈ రాయి దాని స్థలం నుంచి కొంచెం కూడా కదలలేదు. అందుకే దీన్ని బ్యాలెన్సింగ్ రాక్ అని పిలుస్తారు. దీని గురించి పురావస్తు శాస్త్రవేత్త మాట్లాడుతూ శిలాద్రవం గట్టిపడటం వల్ల ఈ శిలలు ఏర్పడి ఉండవచ్చని తెలిపారు.

దీనిని చూస్తే పడిపోతుందా అన్నట్లు ఉంటుంది. కానీ ఇది చాలా ఏళ్లుగా ఇదే స్థితిలో ఉంటుంది. ఈ బ్యాలెన్స్ రాక్ చూసేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు ఇక్కడికి రావడం విశేషం.



