AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic Benefits: చలికాలంలో వెల్లుల్లితో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు.. ఏంటో తెలుసుకోండి..

వెల్లుల్లి.. కేవలం రుచి మాత్రమే కాదు.. ఎన్నో ఔషదగుణాలను కలిగి ఉంటుంది. ఎన్నో శతాబ్ధాలుగా ఆయుర్వేదంలో

Garlic Benefits: చలికాలంలో వెల్లుల్లితో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు.. ఏంటో తెలుసుకోండి..
Garlic
Rajitha Chanti
|

Updated on: Nov 08, 2021 | 7:13 PM

Share

వెల్లుల్లి.. కేవలం రుచి మాత్రమే కాదు.. ఎన్నో ఔషదగుణాలను కలిగి ఉంటుంది. ఎన్నో శతాబ్ధాలుగా ఆయుర్వేదంలో వెల్లుల్లిని ఉపయోగిస్తుంటారు. అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ వెల్లుల్లి ఎక్కువగా సహయపడుతుంది. ఇందులో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో అల్లిసిన్, మాంగనీస్, విటమిన్ బీ6, విటమిన్ సీ, సెలినీయం, ఫైబర్ వంటివి ఉంటాయి. అయితే ఇన్ని ప్రయోజనాలున్న వెల్లుల్లితో చలికాలంలో కలిగే ప్రయోజనాలెంటో తెలుసుకుందామా.

చలికాలంలో వెల్లుల్లిని తినడం వలన జలుబు తగ్గుతుంది. అలాగో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇటీవల జరిపిన అధ్యాయనంలో వెల్లుల్లి తీసుకునేవారిలో జలుబు వలన వచ్చే సమస్య 63 శాతం తగ్గుతుందట. అలాగే రక్తపోటును నియంత్రిస్తుంది. అల్లిసిన్ వెల్లుల్లిలో ఉండడం వలన రక్తపోటులో సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. వెల్లుల్లిని తేనెతో కలిపి తీసుకుంటే అధిక రక్తపోటు నుంచి త్వరగా ఉపశమనం పొందుతాము. వెల్లుల్లి బరువును తగ్గిస్తుంది. ఇందులో అనేక రకాల పోషకాలు.. కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం వలన బరువు తగ్గుతారు. అలాగే వెల్లుల్లిని తీసుకోవడం వలన ర్కతంలో గ్లూకోజ్ స్థాయి కూడా అదుపులో ఉంటుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడమే కాకుండా మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇక ఇటీవల ఎలుకపలపై జరిపిన ఓ అధ్యయనంలో వెల్లుల్లిని తీసుకోవడం స్త్రీల శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ వలన ఎముకలు దెబ్బతినకుండా సహాయపడుతుంది. అంతేకాకుండా.. వెల్లుల్లి దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. దీని వలన దంతక్షయం వంటి సమస్యలు రావు.

Also Read: Samantha: ‘నీలాంటి వ్యక్తి లైఫ్‌లో ఉండటం నా అదృష్టం’… సమంత ఎమోషనల్ పోస్ట్

Natraj Master: పాపం పండింది.. ఊసరవెల్లి బయటకు వచ్చింది.. నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్…

Suriya Jai Bhim: ఆకట్టుకుంటున్న జైభీమ్ మేకింగ్ వీడియో.. హైకోర్టు సెట్ ఎన్ని రోజుల్లో వేశారంటే..

Allu Arjun Diwali: ఫామ్‌ హౌజ్‌లో మెగా ఫ్యామిలీ సందడి.. బన్నీ, స్నేహల లుక్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..