Allu Arjun Diwali: ఫామ్‌ హౌజ్‌లో మెగా ఫ్యామిలీ సందడి.. బన్నీ, స్నేహల లుక్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Allu Arjun Diwali: టాలీవుడ్‌లో చూడముచ్చటైన జంటల్లో అల్లు అర్జున్, స్నేహలు ఒకరు. ఈ జంట.. స్క్రీన్‌పై కనిపించే హీరో, హీరోయిన్లను మైమరిపిస్తుంటారు. పెళ్లై 10 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ ఈ క్యూట్‌ కపుల్‌..

Allu Arjun Diwali: ఫామ్‌ హౌజ్‌లో మెగా ఫ్యామిలీ సందడి.. బన్నీ, స్నేహల లుక్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Allu Arjun
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 08, 2021 | 6:00 PM

Allu Arjun Diwali: టాలీవుడ్‌లో చూడముచ్చటైన జంటల్లో అల్లు అర్జున్, స్నేహలు ఒకరు. ఈ జంట.. స్క్రీన్‌పై కనిపించే హీరో, హీరోయిన్లను మైమరిపిస్తుంటారు. పెళ్లై 10 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ ఈ క్యూట్‌ కపుల్‌ అన్యోన్యతకు మారుపేరుగా నిలుస్తున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే కాస్త ఖాళీ సమయం దొరికిందంటే చాలు బన్నీ, స్నేహలు రెక్కలు కట్టుకొని వాలిపోతుంటారు. ఇక సోషల్‌ మీడియాలో ఈ జంటకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారుతాయనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తాజాగా ఈ జంటకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల జరిగిన దీపావళి వేడుకల్లో భాగంగా అల్లు అర్జున్‌, స్నేహ.. రామ్‌చరణ్‌, ఉపాసనలతో పాటు పలువురు మెగా ఫ్యామిలీ మెంబర్స్‌ పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో ఈ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా క్యాండిల్‌లైట్స్‌తో పాటు విద్యుత్‌ దీపాలతో అందంగా డెకరేట్‌ చేశారు. ఈ సందర్భంగా బన్నీ, స్నేహాలు కలిసి తీసుకున్న ఓ ప్రోమో వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో ఈ జంట ముందు హీరో, హీరోయిన్లు కూడా బలదూర్‌ అవ్వాల్సిందే.

ఇక ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అల్లు అర్జున్‌.. ‘ఫామ్‌ హౌజ్‌లో అందరం కలిసి దీపావళీ వేడుకను నిర్వహించాం. ఈ డెకరేషన్‌ అంతటినీ స్వయంగా స్నేహనే దగ్గరుండి చేయించారు.. దీపావళి వైబ్స్‌’ అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ముఖ్యంగా స్నేహ, బన్నీ ధరించిన అవుట్‌ ఫిట్స్‌ అద్భుతం అంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Telangana CM KCR Press Meet Live: మరోసారి మీడియా ముందుకు సీఎం కెసిఆర్

Crime News: అత్యాచారం చేశారని మహిళ ఫిర్యాదు.. పోలీసుల విచారణలో బయటపడిన అసలు నిజం..

Olectra Buses: ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రవేశపెడుతున్న ఒలెక్ట్రా.. ఎపీఎస్‌ఆర్టీసీ నుంచి 100 బస్సుల ఆర్డర్‌