Uggani: రాయలసీమ స్టైల్లో ఉగ్గాని ఎలా రెడీ చేయాలో తెలుసుకోండి.. ఇలా చేస్తే టెస్ట్ అదుర్స్..
హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీ..కాకినాడ స్పెషల్ కాజా.. అమలపురం పుతరేకులు.. అవకాయ పచ్చళ్లు.. ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో
హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీ..కాకినాడ స్పెషల్ కాజా.. అమలపురం పుతరేకులు.. అవకాయ పచ్చళ్లు.. ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో వంటకం స్పెషల్. అలా తెలంగాణ.. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేకమైన వంటకాలు ఉన్నాయి. అందులో రాయలసీమ ప్రాంతంలో ఉగ్గాని చాలా ప్రత్యేకం. ఈ ప్రాంతంలో రెడీ చేసే ఉగ్గాని టెస్ట్ అదుర్స్ అంటుంటారు. అసలు ఉగ్గాని అంటే ఏంటీ ? ఎలా చేస్తారు అనేది తెలుసుకుందామా ?…
ముంత మసాలా.. అంటే విన్నారా.. ఆటుకులతో, మరమరాలతో చేసి పులిహోరాను ముంత మసాలా అంటారు. ఈ ముంత మసాలాను అన్ని చోట్ల చేస్తారు. కానీ రాయలసీమలో ఈ ముంత మసాలా టెస్ట్ కాస్త వేరుగా ఉంటుంది. అక్కడ ముంత మసాలాను ఉగ్గాని అంటారు. కొన్ని చోట్లు ఈ ఉగ్గానిని బొరుగుల ఉప్మా అని కూడా పిలుస్తారు. మరీ ఈ ఉగ్గానిని ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందామా.
తయారీ విధానం.. ముందుగా నానబెట్టిన మరమరాలను క్రిస్పీ రూపంలో ఉపయోగించకుండా చేస్తారు. ఉప్మా చేసే విధంగాను ఈ మరమరాలను తరిగిన కూరగాయలు.. కొద్దిగా మసాలాతో తయారు చేస్తారు. ముందుగా ఉబ్బిన బియ్యాన్ని నీటిలో కొద్ది సేపు నానబెట్టి.. ఆపై వడకట్టాలి. తరిగిన ఉల్లిపాయలు.. టమోటా ముక్కలు.. కొద్దిగా నూనెలో వేయించిన మసాలా దినుసులు.. ఊరద్ పప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించాలి. ఇందులో కాస్త నెయ్యి వేసుకోవచ్చు. ఆ తర్వాత మరమరాలను వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కొన్ని నిమిషాలపాటు వేయించాలి. చివరగా.. వేరుశనగ.. తరిగిన కొత్తిమీర, మసాలా కలపాలి. ఇక చివరగా.. నిమ్మరసం కలుపుకుంటే టెస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఆంధ్రలో ఈ ఉగ్గాని చాలా ప్రత్యేకం. హైదరాబాద్.. విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో ఈ ఉగ్గాని వీధులలో విక్రయిస్తుంటారు.
Also Read: Samantha: ‘నీలాంటి వ్యక్తి లైఫ్‌లో ఉండటం నా అదృష్టం’.. సమంత ఎమోషనల్ పోస్ట్
Natraj Master: పాపం పండింది.. ఊసరవెల్లి బయటకు వచ్చింది.. నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్…