Potato Juice: పొటాటో జ్యూస్‌ ఎప్పుడైనా తాగారా..! ఈ ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధం..

Potato Juice: బంగాళదుంప రసంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ బి, సి, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, కాపర్ పుష్కలంగా ఉన్నాయి.

Potato Juice: పొటాటో జ్యూస్‌ ఎప్పుడైనా తాగారా..! ఈ ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధం..
Potato Juice
Follow us
uppula Raju

|

Updated on: Nov 08, 2021 | 9:45 PM

Potato Juice: బంగాళదుంప రసంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ బి, సి, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, కాపర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. బంగాళాదుంప జ్యూస్‌ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మీ చర్మ సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జలుబు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. పరగడుపున ఒక గ్లాసు బంగాళాదుంప రసం తాగితే చాలా మంచిది.

2. ఆర్థరైటిస్, కీళ్ల సమస్యలు బంగాళాదుంప రసం ఆర్థరైటిస్, కీళ్ల సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నొప్పి ఉన్న ప్రదేశంలో బంగాళాదుంప ముక్కలను రుద్దడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

3. అల్సర్ల నుంచి ఉపశమనం బంగాళాదుంప రసం జీర్ణశయాంతర ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బంగాళాదుంప రసాన్ని రోజూ ఉదయం తీసుకోవడం వల్ల అల్సర్ల చికిత్సలో సహాయపడుతుంది.

4. కాలేయానికి మంచిది ఇది కాలేయం, పిత్తాశయాన్ని శుభ్రపరిచే డిటాక్స్ డ్రింక్‌గా కూడా పనిచేస్తుంది. అధ్యయనం ప్రకారం హెపటైటిస్ చికిత్సకు జపాన్‌లో బంగాళాదుంప రసాన్ని ఉపయోగిస్తారు.

5. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది బంగాళదుంప రసంలో ఫైబర్, విటమిన్ ఎ, బి-కాంప్లెక్స్, సి పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో శరీరాన్ని శక్తివంతంగా చేయడంలో సహాయపడతాయి.

6. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఒక అధ్యయనం ప్రకారం బంగాళదుంపల రసం క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అవి గ్లైకోఅల్కలాయిడ్ అనే రసాయన మూలకాన్ని కలిగి ఉంటాయి. ఇది యాంటీ-ట్యూమర్ లక్షణాలను కలిగి ఉంటుంది. క్యాన్సర్ అవకాశాలను తగ్గిస్తుంది.

Britain: బ్రిటన్‌లో విజృంభిస్తున్న మరో వైరస్.. కరోనా గందరగోళంలో మరో సమస్య..

Minister KTR: తెలంగాణకు నిధుల కేటాయింపులో కేంద్ర సర్కార్ తీరుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

Liquor stores: రేపటి నుంచి మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ.. గౌడ్స్, ఎస్సీ, ఎస్టీలకు ఎన్ని కేటాయించారంటే..