వారానికి రెండు రోజులు చేపలను తింటే ఈ సమస్యలు తగ్గుతాయట… అధ్యాయనాల్లో ఆసక్తికర విషయాలు..
చేపలు ఆరోగ్యానికి మంచిచేస్తాయని అందరికి తెలిసిన విషయమే.. చేపలను తీసుకోవడం వలన కళ్లకు.. మెదడుకు ఎన్నో ప్రయోజనాలున్నాయి.
చేపలు ఆరోగ్యానికి మంచిచేస్తాయని అందరికి తెలిసిన విషయమే.. చేపలను తీసుకోవడం వలన కళ్లకు.. మెదడుకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. అయితే చేపలను ఎక్కువగా తీసుకోవడం వలన మెదడు ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన మెదడు సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయని ఇటీవల అధ్యాయనాలు వెల్లడించాయి. సెరెబ్రోవాస్కులర్ డిసీజ్.. ఇది మెదడుకు దారితీసే రక్తనాళాలు మూసి వేసే వ్యాధి.. ఇది మెదడులోని రక్తప్రసరణను ప్రభావితం చేస్తుంది. ఈ స్థితిలో మెదడులో స్ట్రోక్ లేదా ఇతర సమస్యలు ఎక్కువవుతాయి. అయితే వారానికి రెండు రోజులు చేపలను తీసుకుంటే స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది. అమెరికాలో ప్రతి ఐదుగురిలో ఒకరు మెదడుకు రక్తం అందక మరణిస్తున్నారని ఇటీవల అధ్యయనంలో తెలీంది.
చేపలను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన మెదడు సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చేపలను ఎక్కువగా తినేవారిలో స్ట్రోక్ లక్షణాలు తక్కువగా ఉన్నాయని అధ్యాయనాల్లో తెలీంది. చేపలలో ఉండే ఒమేగా 3 పాలీఅన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ సెరెబ్రోవాస్కులర్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వారానికి రెండుసార్లు.. అంతకంటే ఎక్కువ సార్లు చేపలను తినేవారిలో మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఫ్రాన్స్ లోని బోర్డోక్స్ యూనివర్సిటీలో సీనియర్ పరిశోధకురాలు.. అధ్యాయానికి ప్రధాన రచయిత అయిన డాక్టర్ సిసిలియా సమీరీ మాట్లాడుతూ.. మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి . చేపలను తీసుకోవాలని.. వారానికి రెండు రోజులు చేపలను తీసుకుంటే.. బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. వృద్దులకు మరింత ముఖ్యమైనంది. అలాగే చిన్నవయసులో ఒత్తిడిని తగ్గిస్తుంది.
Also Read: Adipurush: ఆదిపురుష్ కోసం తన పార్ట్ కంప్లీట్ చేసిన ఇంద్రజిత్.. ఎప్పటికీ మర్చిపోలేనంటూ..
Bholaa Shankar: భోళా శంకర్ సినిమా అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్.. మెగాస్టార్ న్యూలుక్ చుశారా ?..
Pradeep Machiraju: మహాభారత యుద్ధంలో కౌరవ..పాండవ సేనకు భోజనం పెట్టింది ఎవరు? ఆహా..అనిపించిన ప్రదీప్!