Adipurush: ఆదిపురుష్ కోసం తన పార్ట్ కంప్లీట్ చేసిన ఇంద్రజిత్.. ఎప్పటికీ మర్చిపోలేనంటూ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం నటిస్తున్న లెటేస్ట్ చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్.. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా

Adipurush: ఆదిపురుష్ కోసం తన పార్ట్ కంప్లీట్ చేసిన ఇంద్రజిత్.. ఎప్పటికీ మర్చిపోలేనంటూ..
Adipurush
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 09, 2021 | 8:14 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం నటిస్తున్న లెటేస్ట్ చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్.. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున రూపొందిస్తున్నారు. ఇందులో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతిసనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే .. ప్రభాస్.. కృతి సనన్, సైఫ్ అలీఖాన్.. సన్నీ సింగ్ తమ పాత్రలకు సంబంధించిన షూటింగ్ పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆదిపురుష్ సినిమాలోని ఇంద్రజిత్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తైయిందట. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది చిత్రయూనిట్. ఇందులో ఇంద్రజిత్ పాత్రలో వత్సల్ శేత్ కనిపించబోతున్నాడు. తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తికావడంతో ఎమోషనల్ అయ్యాడు వత్సల్. నా కెరీర్‏లో ఆదిపురుష్ జర్నీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రభాస్ సర్, సైఫ్ సర్‏తో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది. కృతి సనన్.. సన్నీ సింగ్, దేవా భాయ్‏లు మంచి కోస్టార్స్.. ఇంద్రజిత్ పాత్రను ఇచ్చినందుకు ఓం రావత్ సర్‏కు థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు. ఇతనికి చిత్రయూనిట్ ఘనంగా వీడ్కోలు తెలిపింది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 11న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.  అత్యంత భారీ బడ్జెట్‏తో రూపొందిస్తున్న ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.  ఇదిలా ఉంటే.. ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతోపాటు.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంల సలార్ సినిమా చేస్తున్నాడు.

ట్వీట్..

Also Read: Jai Bhim – Raghava Lawrence: మరోసారి దాతృత్వం చాటుకున్న లారెన్స్.. జై భీమ్ రియల్ ‘సినతల్లి’కి భారీ సాయం..

Bholaa Shankar: భోళా శంకర్ సినిమా అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్.. మెగాస్టార్ న్యూలుక్ చుశారా ?..