Prabhas: పప్పులో కాలేసిన లక్ష్మణుడు.. తెలుసుకోవాలి కదా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా గడిపేస్తున్నాడు. జక్నన్న తెరకెక్కించిన బాహుబలి సినిమాతో

Prabhas: పప్పులో కాలేసిన లక్ష్మణుడు.. తెలుసుకోవాలి కదా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 08, 2021 | 4:39 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా గడిపేస్తున్నాడు. జక్నన్న తెరకెక్కించిన బాహుబలి సినిమాతో డార్లింగ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాతో ఏ హీరో అందుకోలేని ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. ఇక యంగ్ రెబల్ స్టార్‏కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా.. అది పండగలా జరుపుకుంటారు. ఇక తమ అభిమాన హీరోను ఎవరైనా చిన్న మాట అన్నా.. పొరపాటున తప్పు కామెంట్స్ చేసిన అస్సలు ఊరుకోరు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోపై ప్రభాస్ అభిమానులు ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఆ మాత్రం కూడా తెలియదా.. ముందు తెలుసుకోవాలి కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు ? ఏం తప్పు చేశాడు.. ? ప్రభాస్ ఫ్యాన్స్ ఎందుకు ఫైర్ అవుతున్నారో తెలుసుకుందామా.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఎంత స్టార్‏డమ్ అందుకున్నా.. సామాజిక మాధ్యమాలలో ఈ హీరో కాస్త తక్కువగానే యాక్టివ్‏గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పుడో ఒకసారి మాత్రమే సోషల్ మీడియాలో తన పర్సనల్ విషయాలు.. మూవీ అప్డేట్స్ షేర్ చేస్తుంటాడు. అది కూడా కేవలం ఫేస్ బుక్, ఇన్‏స్టాగ్రామ్ మాత్రమే. పాన్ ఇండియా రేంజ్‏కు ఎదిగిన ప్రభాస్ మాత్రం ఇప్పటికీ ట్విట్టర్ ఉపయోగించడు.

Sunny Singh

Sunny Singh

ప్రస్తుతం ప్రభాస్..బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కృతి సనన్.. సైఫ్ అలీఖాన్.. సన్నీ సింగ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే సైఫ్ అలీఖాన్.. కృతి సనన్ తమ పార్ట్ షూటింగ్ ముగించేశారు. ఇక ఇటీవల ప్రభాస్ సైతం తన పాత్ర షూటింగ్ కంప్లీట్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ప్రభాస్ సినిమాలో లక్ష్మణుడిగా నటిస్తున్న సన్నీ సింగ్.. అతడితో దిగిన ఫోటోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. పెద్దన్నతో పని చేయడం గొప్పగా ఉంది. మా ఫ్రెండ్ షిప్ కొనసాగుతుంది అంటూ ప్రభాస్ పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేశాడు. అయితే ట్విట్టర్ అకౌంట్ ఉన్న వారిని మాత్రేమే ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రభాస్ కు ట్విట్టర్ ఆకౌంట్ లేదు. అందుకే ప్రభాస్ గురించి ఎవరు ప్రత్యేకంగా ట్వీట్ చేసినా.. ప్రభాస్ హ్యాష్ ట్యాగ్ ఉపయోగిస్తారు. కానీ సన్నీ మాత్రం ఆ విషయం తెలియక మరెవరినో ట్యాగ్ చేశాడు. ప్రభాస్ పేరు మీద కొన్ని వేల ఫేక్ అకౌంట్స్ ఉంటాయి. అతడి పేరు కొట్టగానే లెక్కలేనన్ని ఖాతాలు ఓపెన్ అవుతాయి. దీంతో ప్రభాస్ అని రాగానే ట్యాగ్ చేశాడు సన్నీ. దీంతో అతడి తీరుపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంత నిర్లక్ష్యం ఏంటీ..అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‏కు ట్విట్టటర్ అకౌంట్ ఉందో ? లేదో ? తెలుసుకోవాలి కదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Bigg Boss 5 Telugu: ప్రియాంక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మానస్ తల్లి..పెళ్లి చేస్తా అంటూ..

Bigg Boss 5 Telugu: షో ముగిసే సమయంలో ఈ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ వార్తలేంటీ.? హౌజ్‌లోకి కొత్త కంటెస్టెంట్‌ నిజంగానే వస్తున్నారా?

Balakrishna: మనలో ఒకడు.. సెల్ఫ్ మేడ్‏కి సర్‏నేమ్.. బాలకృష్ణ అన్‏స్టాపబుల్‏ షో సెకండ్ గెస్ట్ ఎవరంటే..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ