Balakrishna: మనలో ఒకడు.. సెల్ఫ్ మేడ్‏కి సర్‏నేమ్.. బాలకృష్ణ అన్‏స్టాపబుల్‏ షో సెకండ్ గెస్ట్ ఎవరంటే..

నందమూరి బాలకృష్ణ డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన సంగతి తెలిసందే. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో అన్‏స్టాపబుల్‏ విత్ ఎన్బీకే అనే టాక్

Balakrishna: మనలో ఒకడు.. సెల్ఫ్ మేడ్‏కి సర్‏నేమ్.. బాలకృష్ణ అన్‏స్టాపబుల్‏ షో సెకండ్ గెస్ట్ ఎవరంటే..
Nani
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 08, 2021 | 3:35 PM

నందమూరి బాలకృష్ణ డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన సంగతి తెలిసందే. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో అన్‏స్టాపబుల్‏ విత్ ఎన్బీకే అనే టాక్ షోకు బాలయ్య హోస్ట్‏గా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నారు. దీపావళి రోజు నుంచి ఈ షో స్ట్రీమింగ్ అవుతూ.. విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక తొలి ఎపిసోడ్‏లో మంచు మోహన్ బాబు ఫ్యామిలీపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ సందడి చేశారు బాలకృష్ణ. మోహన్ బాబుతోపాటు.. మంచు లక్ష్మి, మంచు విష్ణు సైతం ఈషోలో పాల్గోన్నారు. ఇక వీరిని తనదైన స్టైల్లో ప్రశ్నిస్తూ అలరించారు బాలయ్య. ఇక మొదటి రోజు ఈ షోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చినట్లుగా టాక్.

ఇదిలా ఉంటే.. ఇటీవల బాలకృష్ణ తన కుడి చేయి భుజానికి సర్జరీ చేయించుకోవడంతో ఈ షో స్ట్రీమింగ్ పై పలు అనుమానాలు మొదలయ్యాయి. నెట్టింట్లో అన్‏స్టాపబుల్‏ షో సెకండ్ ఎపిసోడ్ ఎప్పుడూ వస్తుంది ? అసలు ఉంటుందా? లేదా ? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ సంస్థ ఆహా ఆ రూమర్స్‏కు చెక్ పెట్టింది. బాలకృష్ణ.. అన్‏స్టాపబుల్‏ విత్ ఎన్బీకే షోకు సెకండ్ గెస్ట్ ఎవరనేదానిపై స్పష్టతనిస్తూ… అందుకు సంబంధించిన ఫోటోలను రివీల్ చేసింది ఆహా. మనలో ఒకడు.. సెల్ఫ్ మేడ్‏కి సర్ నేమ్.. మన రెండో గెస్ట్ నాని.. అని తెలుపుతూ అందుకు సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేసింది. బాలకృష్ణతో గేమ్ ఆడుతూ.. చిరునవ్వులు చిందిస్తూ నాని కనిపిస్తున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన ప్రోమోను ఈరోజు సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది ఆహా.

ట్వీట్..

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. అలాగే.. ఈరోజు విడుదలైన అఖండ టైటిల్ సాంగ్ యూట్యూబ్‏లో దూసుకుపోతుంది.

Also Read:  BheemlaNayak: రికార్డ్స్ వేటలో భీమ్లానాయక్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న టైటిల్ సాంగ్..

Bigg Boss 5 Telugu: ఊహించని ట్విస్ట్.. ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే..