Bigg Boss 5 Telugu: ఊహించని ట్విస్ట్.. ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే..

తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ షో రోజు రోజుకు ఆసక్తికరంగా సాగుతోంది. ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారు.

Bigg Boss 5 Telugu: ఊహించని ట్విస్ట్.. ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే..
Bigg Boss
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 07, 2021 | 10:32 PM

Bigg Boss 5 Telugu: తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ షో రోజు రోజుకు ఆసక్తికరంగా సాగుతోంది. ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారు. ఎవరు హౌస్‌లో కంటిన్యూ అవుతారు అన్నది ఉత్కంఠగా సాగుతోంది. ఇక వారాంతం వచ్చిందంటే చాలు హౌస్లో సందడి డబుల్ అవుతుంది. హోస్ట్ నాగార్జున తనదైన ఎంటర్టైన్మెంట్‌తో హౌస్ మేట్స్‌లో జోష్ పెంచుతారు. అలాగే రకరకాల టాస్క్‌‌లు ఇచ్చి హౌస్ మేట్స్‌ను ముప్పుతిప్పలు పెడతారు. అలాగే చివరిలో ఒకరిని హౌస్ నుంచి బయటకు పంపించేస్తారు..

19 మందితో మొదలైన బిగ్‌బాస్‌ షోలో ప్రస్తుతం 9 వారం వచ్చేసరికి 8 మంది ఎలిమినేట్‌ అయ్యారు. ఇప్పటి వరకు హౌజ్‌ నుంచి.. సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేత, ప్రియ, లోబో ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ హౌజ్‌లో మరో ఎలిమినేషన్‌ జరిగింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఎలిమినేషన్‌ జరిగింది. ఈ క్రమంలోనే ఈ వారం ఎలిమినేషన్‌లో షణ్ముఖ్ తప్ప.. మిగిలిన 10 మంది నామినేట్ అయ్యారు. చివరకు వీరిలో కాజల్, ప్రియాంక , విశ్వ మిగిలారు. ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యారు. మొదటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఆడుతూ వస్తున్న విశ్వ ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు.  విశ్వ ఎలిమినేట్ అని అనౌన్స్ చేయగానే ఆనీ మాస్టర్ కన్నీళ్ళు పెట్టుకున్నారు. సన్నీ, శ్రీరామ్ కూడా ఎమోషనల్ అయ్యారు.  Vishwa

మరిన్ని ఇక్కడ చదవండి : 

Manisha Koirala: ప్రయాణం కష్టమైనదని నాకు తెలుసు.. అయినా కొనసాగించాలి.. మనీషా కోయిరాలా..

Lasya Manjunath: స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్న ‘లాస్య మంజునాథ్’ కొడుకు.. ఫ్యామిలీ ఫొటోస్..

Nivetha Pethuraj: న్యూ ఫోటో స్టిల్స్ తో కుర్రోళ్ళ మతి పోగొడుతున్న నివేత పేతురాజ్ ఫొటోస్..