Bigg Boss 5 Telugu: ప్రియాంక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మానస్ తల్లి..పెళ్లి చేస్తా అంటూ..

బిగ్‏బాస్ సీజన్ 5.. సీజన్ 5 మొదటి నుంచి నత్త నడకల సాగుతుంది అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

Bigg Boss 5 Telugu: ప్రియాంక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మానస్ తల్లి..పెళ్లి చేస్తా అంటూ..
Maanas
Follow us
Rajitha Chanti

| Edited By: Phani CH

Updated on: Nov 08, 2021 | 5:47 PM

బిగ్‏బాస్ సీజన్ 5.. సీజన్ 5 మొదటి నుంచి నత్త నడకల సాగుతుంది అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.  షో ఆసక్తికరంగా లేదనేది ముందు నుంచి వినిపిస్తున్న వాదన. ఇక  మూడవ సీజన్‏లో ట్రాన్స్‏జెండర్‏గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా హౌస్‏లో చేసిన రచ్చ గురించి తెలిసిందే. వచ్చిన రెండు రోజులు సరిగ్గానే ప్రవర్తించి.. నామినేట్ చేసినందుకు రవికృష్ణను టార్గెట్ చేసి మరీ చుక్కలు చూపించింది. దీంతో తన పై తన పూర్తి నెగిటివిని కల్గించుకుంది. ఇక సీజన్ 5లో ట్రాన్స్‏జెండర్‏గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్ మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం.

షో మొదటి నుంచి అందరితో సన్నిహితంగా ఉంటూ.. మంచి పేరు సంపాదించుకుంది ప్రియాంక. అయితే ఇంట్లో అందరి అన్నయ్య అంటూ పిలుస్తానని… కేవలం మానస్ మాత్రం కాదని ముందే చెప్పేసింది ప్రియాంక. అయితే రోజు రోజుకీ అతనిపై ప్రేమను పెంచుకుంటూ మానస్‏కు తెగ సపర్యలు చేసేస్తుంది. ఉదయం నుంచి రాత్రి వరకు మానస్ చూట్టు తిరుగుతూనే ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రియాంక మానస్ ద్యాసలో పడి గేమ్ సరిగా ఆడడం లేదని ఇప్పటికే ఇంటి సభ్యులు ఆమెకు సలహాలు కూడా ఇచ్చారు. అయినా ప్రియాంక మాత్రం మానస్ చూట్టూనే తిరుగుతూ కనిపిస్తుంది. కానీ మానస్ మాత్రం.. ప్రియాంకను దూరం పెడుతూ.. కేవలం తనను తన తోటి హౌస్ మేట్‏గానే చూస్తున్నాడు. అయితే ప్రియాంక ప్రవర్తనపై ఆమె అభిమానులు తెగ కంగారు పడుతున్నారు. గేమ్ కోసం వెళ్లినా ప్రియాంక ఇలా మారిపోయిందేంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ప్రియాంక, మానస్ రిలేషన్ పై మానస్ తల్లి స్పందించింది.

ఓ ఇంటర్వ్యూలో మానస్ తల్లి మాట్లాడుతూ.. ప్రియాంక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె చాలా మంచి అమ్మాయి. నాకెంతో ఇష్టం. ఓసారి ప్రియాంక.. మానస్‏ను హస్బెండ్ మెటీరియల్ అన్నది. కానీ మానస్ కేవలం ఆమె మరదలని మాత్రమే చెప్పాడు. బిగ్‏బాస్ అనేది కేవలం 110 రోజుల ఆట. ఇందులో ఎంత మంది జంటలు బయటకువచ్చారు ? ఎంత మంది పెళ్లిళ్లు చేసుకున్నారు ? ఏదైనా షో వరకే.. అందులో ఉన్నవాళ్లకు తెలుసు.. కాకపోతే ఇంట్లో ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఎలా ఉంటారు.. స్నేహితులుగా మాట్లాడుకుంటారు. ఇంట్లో మానస్‏కు ఎవరు సెట్ కారు.. నేను ఎవర్ని వేలు పెట్టి చూపిస్తే తననే చేసుకుంటాడు.. ప్రియాంక సింగ్.. నా కొడుకును పెళ్లి చేసుకుంటానంటే మాత్రం ఒప్పుకోను. ఆమెకు తగిన అబ్బాయిని చూసి పెళ్లి చేయిస్తా.. అలా ప్రియాంకకు నేను సపోర్ట్ చేస్తాను. ఏదైనా సాయం చేస్తాను అంటూ చెప్పింది మానస్ తల్లి. అలాగే తను చదుకునే రోజుల్లో ప్రేమించిన అమ్మాయి అమెరికా వెళ్లిపోవడానికి రెడీ అయ్యింది. దీంతో ఏం చేయాలని నన్ను అడిగాడు..నీదింకా చిన్న వయసు.. కరెక్ట్ గా అవకుండా అమెరికా వెళ్లడం కరెక్ట్ కాదేమోనన్నాను. మానస్ సరే అని ఆగిపోయాడు. అలా కెరీర్ మీద ఫోకస్ పెట్టాడు అంటూ చెప్పుకొచ్చింది.

Also Read:

Dead man’s fingers: భూమి లోంచీ బయటికొచ్చిన చేతి వేళ్లు.. భయంతో వణికిపోయిన జనం.. వీడియో

Viral Video: ఇక్కడ అడుగు పెడితే వందేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది.. వీడియో

Balakrishna: మనలో ఒకడు.. సెల్ఫ్ మేడ్‏కి సర్‏నేమ్.. బాలకృష్ణ అన్‏స్టాపబుల్‏ షో సెకండ్ గెస్ట్ ఎవరంటే..

Aryan Khan Drugs case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. షారూఖ్‌ మేనేజర్ పూజకు నోటీసులు..