Aryan Khan Drugs case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. షారూఖ్ మేనేజర్ పూజకు నోటీసులు..
Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ తీసుకుంటూ.. అక్టోబర్ 2న
Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ తీసుకుంటూ.. అక్టోబర్ 2న ఎన్సీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్సీబీ స్పెషల్ కోర్టు, కింది కోర్టులు ఆర్యన్ ఖాన్ బెయిల్‌ను తిరస్కరించగా.. అక్టోబర్ 28 హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఈ కేసును విచారిస్తు్న్న ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అతనిపై విచారణకు ఆదేశించి.. ఆర్యన్ కేసు విచారణ నుంచి ఎన్సీబీ వాంఖడేను తప్పించింది. ఎన్సీబీ అధికారి సంజయ్ నేతృత్వంలోని బృందం ఈ కేసును విచారిస్తోంది. అయితే.. ఈ డ్రగ్స్ కేసు వ్యవహారం మళ్లీ కీలకమలుపు తిరిగింది. విచారణ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీకి ముంబై పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమన్లు జారీ చేసింది. కిరణ్ గోసావి దోపిడీ కేసును ముంబై పోలీసులు విచారిస్తున్నారు. అనారోగ్యం కారణంగా ఇప్పుడు హాజరుకాలేనని.. కొంత సమయం ఇవ్వాలంటూ పూజా దద్లానీ ముంబై పోలీసులను కోరారు.
శనివారం హాజరు కావాలని ముంబై పోలీసులు దద్లానీకి సమన్లు పంపారు. కానీ ఆమె అనారోగ్యం కారణంగా హాజరుకాలేకపోతున్నానని పోలీసులకు తెలియజేశారు. అంతకుముందు, పూజా దద్లానీతో సహా కొంతమంది వ్యక్తుల కాల్ వివరాల రికార్డులను సేకరించేందుకు, వాట్సాప్ చాట్‌లను సవరించడానికి ఇద్దరు వ్యక్తులు తనను సంప్రదించారని హ్యాకర్ మనీష్ భంగాలే పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో పలు ఆరోపణలు సైతం చేశాడు. వాట్సాప్ చాట్ బ్యాకప్ ఫైల్ ఆర్యన్ ఖాన్ పేరు మీద ఉందని భంగలే పేర్కొన్నారు. డేటా మార్చేందుకు ఇద్దరు వ్యక్తులు కలిశారని పేర్కొన్నాడు.
అక్టోబర్ 6న జల్గావ్‌లో అలోక్ జైన్, శైలేష్ చౌదరి అనే ఇద్దరు వ్యక్తులు తనను సంప్రదించారని మనీష్ భంగలే చెప్పారు. ఇందుకోసం తనకు రూ.5 లక్షలు ఆఫర్ చేశారని.. రూ.10 వేలు కూడా ఇచ్చారని మనీష్ ఆరోపించాడు. వారు కొన్ని నంబర్లు ఇచ్చారని దానిలో షారుక్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ పేరు కూడా ఉన్నట్లు ఆరోపించాడు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. మనీష్ ఆరోపణల నేపథ్యంలో ముంబై పోలీసులు షారుఖ్ మేనేజర్‌కు సమన్లు జారీ చేశారు.
Also Read: