Allu Arjun: గనిగా అదరగొట్టిన అల్లు అయాన్.. ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోన్న స్టైలిష్ స్టార్ వారసుడి వీడియో..
టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ హీరో అంటే చాలామంది ఠక్కున చెప్పే సమాధానం 'అల్లు అర్జున్'. తనదైన స్టైల్, మేనరిజమ్స్‌తో సందడి చేసే ఈ హీరోకు అభిమానగణం భారీగానే ఉంది.

టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ హీరో అంటే చాలామంది ఠక్కున చెప్పే సమాధానం ‘అల్లు అర్జున్’. తనదైన స్టైల్, మేనరిజమ్స్‌తో సందడి చేసే ఈ హీరోకు అభిమానగణం భారీగానే ఉంది. ఇక అర్జున్ సతీమణి స్నేహారెడ్డి్ తన ఫ్యాషనబుల్ ఫొటోలతో సోషల్ మీడియాలో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. వీరితో పాటు ఈ దంపతుల ముద్దుల పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్‌కు కూడా సోషల్ మీడియాలో బోలెడు క్రేజ్ ఉంది. ముఖ్యంగా ‘శాకుంతలం’ సినిమాతో వెండితెరపైకి అడుగుపెడుతున్న అల్లు అర్హకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా తాజాగా అల్లు అయాన్ వర్కవుట్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మెగా ప్రిన్స్ వరుణ్ కొణిదెల హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. సాయి కొర్రపాటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘గని…కనివినీ ఎరుగని’ అంటూ ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ మెగా అభిమానులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ పాటను రీక్రియేషన్ చేశాడు. వరుణ్ తరహాలో భారీ వర్కవుట్లు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను గీతా ఆర్ట్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్లు అయాన్‌ను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. ‘ అచ్చం బన్నీ లాగే ఎనర్జీ..స్టైల్’, ‘తండ్రికి తగ్గ తనయుడు’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Here’s the cute little video surprise featuring #AlluAyaan from @Bobbyallu & Team #Ghani??#AlluAyaanForGhani ?
▶️ https://t.co/tSzQqmIjjY @IAmVarunTej @nimmaupendra @SunielVShetty @dir_kiran @saieemmanjrekar @MusicThaman @ramjowrites @george_dop @abburiravi @adityamusic pic.twitter.com/5iCSghYI4H
— Geetha Arts (@GeethaArts) November 8, 2021
Also Read:
Akhanda Title Song: బాలయ్య అభిమానులకు మాస్ కిక్.. అలరిస్తోన్న అఖండ టైటిల్ సాంగ్..
Entertainment: డేగల బాబ్జీ వచ్చేశాడు.. యాభై దెయ్యాలు బెదిరిస్తున్నాయంటున్న బండ్ల గణేష్ ..