AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Entertainment: డేగల బాబ్జీ వచ్చేశాడు.. యాభై దెయ్యాలు బెదిరిస్తున్నాయంటున్న బండ్ల గణేష్‌ ..

ఇప్పటివరకు క్యారెక్టర్ ఆర్టి్స్టుగా, నిర్మాతగా ప్రేక్షకులకు పరిచయమైన బండ్ల గణేశ్‌ మొదటిసారి కథానాయకుడిగా మారి నటించిన చిత్రం 'డేగల బాబ్జీ'. తమిళంలో పార్తీబన్‌ హీరోగా నటించిన..

Entertainment:  డేగల బాబ్జీ వచ్చేశాడు.. యాభై దెయ్యాలు బెదిరిస్తున్నాయంటున్న బండ్ల గణేష్‌ ..
Basha Shek
|

Updated on: Nov 08, 2021 | 12:48 PM

Share

ఇప్పటివరకు క్యారెక్టర్ ఆర్టి్స్టుగా, నిర్మాతగా ప్రేక్షకులకు పరిచయమైన బండ్ల గణేశ్‌ మొదటిసారి కథానాయకుడిగా మారి నటించిన చిత్రం ‘డేగల బాబ్జీ’. తమిళంలో పార్తీబన్‌ హీరోగా నటించిన ‘ఒత్తు సెరుప్పు సైజ్‌’ 7 చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. వెంకట్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ సోమవారం ఉదయం విడుదలైంది. ప్రముఖ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ చేతుల మీదుగా దీనిని విడుదల చేశారు. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకెళ్లిన ‘డేగల బాబ్జీ’ అనే వ్యక్తిగా బండ్ల గణేశ్‌ నటించాడు.

సుమారు రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ మొత్తమంతా ఆయన ఒక్కరే కనిపించడం విశేషం. ‘యాభై దెయ్యాలు నన్ను బెదిరిస్తు్న్నాయి..భయపెడుతున్నాయి సార్‌’, ‘పుట్టగానే వాడు అసలు ఏడవలేదు’, కానీ వాడు పుట్టినప్పటినుంచి మేం ఏడుస్తూనే ఉన్నాం’, ‘అసలు అమ్మ అందంగా ఉండాలన్న రూల్‌ ఏమైనా’ ఉందా అని బండ్ల గణేశ్‌ నుంచి వచ్చిన డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి.

Also read:

Public star Srikanth: “తెలంగాణ దేవుడు” గా పబ్లిక్ స్టార్ కొత్త అవతారం.. ఆకట్టుకుంటున్న ‘శ్రీకాంత్’ ఫొటోస్..

Geetha Madhuri: సోషల్ మీడియాలో సింగర్ ‘గీత మాధురి’ తెలుగుతనంలా లేటెస్ట్ ఫొటోస్..

Entertainment: ఈ వారం థియేటర్‌/ఓటీటీల్లో అలరించనున్న సినిమాలివే..