Puneet Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ సంస్మరణ కార్యక్రమం.. నేత్రదాన శిబిరాలు నిర్వహిస్తున్న ఫ్యాన్స్

Puneet Rajkumar: కన్నడ యువ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణించి సోమవారంనాటికి 11 రోజులు అవుతున్నాయి. ఈ సందర్భంగా పునీత్ కుటుంబీకులు 11వ రోజు సంస్మరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

Puneet Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ సంస్మరణ కార్యక్రమం.. నేత్రదాన శిబిరాలు నిర్వహిస్తున్న ఫ్యాన్స్
Puneet Rajkumar Samadhi
Follow us
Janardhan Veluru

|

Updated on: Nov 08, 2021 | 10:56 AM

కన్నడ యువ నటుడు పునీత్ రాజ్‌కుమార్(Puneet Rajkumar) మరణించి సోమవారంనాటికి 11 రోజులు అవుతున్నాయి. ఈ సందర్భంగా పునీత్ కుటుంబీకులు 11వ రోజు సంస్మరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.  పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్ 29న గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.  ఆయన భౌతికకాయానికి కర్ణాటక, పొరుగు రాష్ట్రాల్లోని దాదాపు 25 లక్షల మంది అభిమానులు నివాళులర్పించి కన్నీటి వీడ్కోలు పలికారు. కంఠీరవ స్టుడియోలో పునీత్ రాజ్‌కుమార్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.  సోమవారంనాడు 11వ రోజు సంస్మరణ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో  పునీత్ రాజ్‌కుమార్ సమాధిని సందర్శించేందుకు అభిమానులను అనుమతించడం లేదు. అభిమానులు ఎవరూ సోమవారంనాడు పునీత్ సమాధి సందర్శనకు రావద్దని పోలీసులు ఆయన అభిమానులను కోరారు. పునీత్ సమాధి సందర్శనకు మంగళవారం నుంచి అభిమానులకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. కంఠీరవ స్టుడియో వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. పునీత్ సంస్మరణ కార్యక్రమం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగానూ ఆయన అభిమానులు అన్నదానం, నేత్రదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు.

పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధిని ఆదివారంనాడు ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. వేకువజాము నుంచే పునీత్ సమాధిని దర్శించుకునేందుకు బెంగళూరు కంఠీరవ స్టూడియో వద్ద క్యూకట్టారు. వృద్ధులు, పిల్లలు, దివ్యాంగులు, మహిళలకు కూడా భారీ సంఖ్యలో తరలిరావడంతో కంఠీరవ స్టుడియోలో రద్దీ నెలకొంది. అభిమానుల రద్దీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

పునీత్‌ రాజ్‌కుమార్ నేత్రదానంతో స్ఫూర్తి పొందిన వందలాది మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేస్తామంటూ ఆస్పత్రులకు రాసిస్తున్నారు. అటా బెంగళూరు నగరంలో ప్రతి రోజూ రెండు వేల మంది నేత్రదానం చేయడానికి ఆస్పత్రుల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకొంటున్నారు. ఎమ్మెల్యే రేణుకాచార్య కూడా నేత్రదానం చేస్తానని ప్రకటించారు. పునీత్ సంస్మరణ కార్యక్రమం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగానూ ఆయన అభిమానులు నేత్రదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు.

Also Read..

KCR vs BJP: సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రఘునందన్ రావు.. ఏమన్నారంటే..

Bjp vs KCR: ఈ వింత మాటల అక్కడెందుకు మాట్లాడలే.. కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించిన రాములమ్మ..!