AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Katrina Kaif: వేడుకగా కత్రినా, విక్కీల నిశ్చితార్థం.. డిసెంబర్‌లో పెళ్లి పీటలెక్కనున్న ప్రేమపక్షులు..?

బాలీవుడ్‌ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌ ల నిశ్చితార్థం పూర్తయిందా.. డిసెంబర్‌లో వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్సయ్యిందా..అంటే అవుననే అంటున్నారు బాలీవుడ్‌ జనాలు..

Katrina Kaif: వేడుకగా  కత్రినా, విక్కీల నిశ్చితార్థం.. డిసెంబర్‌లో పెళ్లి పీటలెక్కనున్న ప్రేమపక్షులు..?
Basha Shek
|

Updated on: Nov 08, 2021 | 10:08 AM

Share

బాలీవుడ్‌ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌ ల నిశ్చితార్థం పూర్తయిందా.. డిసెంబర్‌లో వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్సయ్యిందా..అంటే అవుననే అంటున్నారు బాలీవుడ్‌ జనాలు. ఇటీవల దీపావళి పండగ రోజున ఇరు కుటుంబ సభ్యులు కలిసి ‘రోకా’ వేడుక జరుపుకున్నారని తెలుస్తోంది. పెళ్లి ముహూర్తం, వేదిక, విందులు తదితర విషయాలు మాట్లాడుకోవడానికి వధూవరుల కుటుంబ సభ్యులు కలిసి మాట్లాడుకోవడమే ‘రోకా’ ఫంక్షన్‌. ఉత్తరాదిలో ఈ సంప్రదాయాన్ని ఎక్కువగా ఆచరిస్తారు. కత్రినాతో ‘ఏక్ థా టైగర్‌’ ‘న్యూయార్క్‌’ వంటి సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్‌ కబీర్‌ ఖాన్‌ ఇంట్లోనే కత్రినా- విక్కీల రోకా వేడుక జరిగిందని సమాచారం. కబీర్‌ తనకు సోదరుడితో సమానమని కత్రినా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అందుకే  ముంబయిలోని ఈ దర్శకుడి ఇల్లే రోక వేడుకకు వేదికగా ఎంచుకున్నారు.

డిసెంబర్‌లో వివాహం..? ఈ వేడుకకు కత్రినా తల్లి సుజానే, సోదరి ఇసా బెల్లే, విక్కీ తల్లిదండ్రుల, సోదరుడు సన్నీ కౌశల్‌ హాజరైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇరుకుటుంబ సభ్యులు కలిసి కత్రినా- విక్కీల పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్‌ చేశారు. డిసెంబర్‌లో వీరు పెళ్లిపీటలెక్కనున్నారని, వివాహానికి కొద్ది రోజుల ముందే అందరికీ ఆహ్వానాలు పంపుదామని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని సవాయ్‌ మాధోపూర్‌లని ఓ రిసార్ట్‌లో పెళ్లి వేడుక జరగనుందని సమాచారం. కాగా ఇటీవల కత్రినా తల్లి, సోదరి ఇటీవల ముంబైలోని ఒక దుస్తుల దుకాణంలో కనిపించిన సంగతి తెలిసిందే. అంతకుముందు విరాట్ కోహ్లీ- అనుష్కా శర్మ ఇంటి పక్కనే ఇద్దరూ కలిసి ఓ అందమైన ఫ్లాట్ తీసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.  దీంతో ఈ ప్రేమపక్షులు త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారన్న వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఇప్పటివరకు తమ ప్రేమ, పెళ్లి విషయాలపై కత్రినా, విక్కీ నోరు విప్పకపోవడం గమనార్హం.

Also Read: Chiranjeevi: మాటల మాంత్రికుడి డైరెక్షన్‌లో మెగాస్టార్‌ .. త్వరలోనే అధికారిక ప్రకటన..

Raviteja: మారేడుమిల్లి అడవుల్లో మాస్‌ మహరాజా.. శరవేగంగా రామారావు షూటింగ్‌.

Katrina Kaif: క్షమించండి అంటూ అక్షయ్‌ కాళ్లు పట్టుకున్న కత్రినా కైఫ్‌.. అసలు విషయమేంటంటే..