Chiranjeevi: మాటల మాంత్రికుడి డైరెక్షన్‌లో మెగాస్టార్‌ .. త్వరలోనే అధికారిక ప్రకటన..

యువ హీరోలతో పోటీపడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ప్రస్తుతం కొరటాల శివతో చేస్తోన్న 'ఆచార్య' ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది

Chiranjeevi:  మాటల మాంత్రికుడి డైరెక్షన్‌లో మెగాస్టార్‌ .. త్వరలోనే అధికారిక ప్రకటన..
Follow us
Basha Shek

|

Updated on: Nov 08, 2021 | 8:35 AM

యువ హీరోలతో పోటీపడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ప్రస్తుతం కొరటాల శివతో చేస్తోన్న ‘ఆచార్య’ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత జయం రాజా దర్శకత్వంలో ‘లూసీఫర్‌’ రీమేక్‌ ‘గాడ్‌ ఫాదర్‌’, మెహర్‌ రమేశ్‌ డైరెక్షన్‌లో ‘భోళాశంకర్‌’ సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఇటీవల బాబీ దర్శకత్వంలో మరో సినిమాను కూడా పట్టాలెక్కించారు. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లోనూ మెగాస్టార్‌ నటించేందుకు రంగం సిద్ధమైంది. వీరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి విదితమే. తాజాగా ఈ ప్రాజక్టు ఓకే అయినట్టు తెలుస్తోంది.

 నిర్మాత ఎవరంటే.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను తెరకెక్కిస్తోన్న డీవీవీ ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ అధినేత డీవీవీ దానయ్య మెగాస్టార్‌- త్రివిక్రమ్‌ కాంబోను పట్టాలెక్కించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ‘అల వైకుంఠపురములో ‘ వంటి ఇండస్ట్రీ హిట్‌ అందుకున్న త్రివిక్రమ్‌ ప్రస్తుతం ప్రిన్స్‌ మహేశ్‌ బాబుతో ఓ సినిమా చేయనున్నాడు. అదేవిధంగా పవన్‌ కల్యాణ్‌ ‘భీమ్లా నాయక్‌’ సినిమాకు స్ర్కీన్‌ప్లే, మాటలు అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో చిరంజీవి కమిట్‌ అయిన సినిమాలు పూర్తయ్యాకే మాటల మాంత్రికుడు ఆయనతో జతకట్టే అవకాశం ఉంది.

Also Read:

Raviteja: మారేడుమిల్లి అడవుల్లో మాస్‌ మహరాజా.. శరవేగంగా రామారావు షూటింగ్‌.

Katrina Kaif: క్షమించండి అంటూ అక్షయ్‌ కాళ్లు పట్టుకున్న కత్రినా కైఫ్‌.. అసలు విషయమేంటంటే..

Sai Dharam Tej: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలోనే షూటింగ్‌కు హాజరుకానున్న సాయి ధరమ్ తేజ్..?