Raviteja: మారేడుమిల్లి అడవుల్లో మాస్‌ మహరాజా.. శరవేగంగా రామారావు షూటింగ్‌.

రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దివ్యాంశ కౌశిక్‌ రవితేజతో రొమాన్స్‌ చేయనుంది..

Raviteja: మారేడుమిల్లి అడవుల్లో మాస్‌ మహరాజా.. శరవేగంగా  రామారావు షూటింగ్‌.
Follow us
Basha Shek

|

Updated on: Nov 08, 2021 | 8:09 AM

రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దివ్యాంశ కౌశిక్‌ రవితేజతో రొమాన్స్‌ చేయనుంది. వేణు తొట్టెంపూడి, రజిషా విజయన్‌, నాజర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోంది. షెడ్యూల్‌లో భాగంగా ఇక్కడ రవితేజపై థ్రిల్లింగ్‌ యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.

పాటల కోసం ఫారిన్‌కు.. ఇక మారేడుమిల్లి షెడ్యూలు ముగిసిన తర్వాత పాటల చిత్రీకరణ కోసం యూనిట్ విదేశాలకు వెళుతుంది. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రవితేజ ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. ‘క్రాక్‌’ తర్వాత రవితేజ వరుసగా సినిమాలు ఓకే చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘రామారావు’ తో పాటు ‘ఖిలాడీ’, ‘ధమాకా’, ‘టైగర్‌ నాగేశ్వరరావు’, ‘రావణాసుర’ సినిమాల్లో నటిస్తున్నారు.

Also Read:

Katrina Kaif: క్షమించండి అంటూ అక్షయ్‌ కాళ్లు పట్టుకున్న కత్రినా కైఫ్‌.. అసలు విషయమేంటంటే..

Sai Dharam Tej: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలోనే షూటింగ్‌కు హాజరుకానున్న సాయి ధరమ్ తేజ్..?

Manu Charitra: ‘మ‌ను చరిత్ర` నుంచి మరో అందమైన మెలోడీ.. యువతను ఆకట్టుకుంటున్న సాంగ్