Manu Charitra: ‘మ‌ను చరిత్ర` నుంచి మరో అందమైన మెలోడీ.. యువతను ఆకట్టుకుంటున్న సాంగ్

యంగ్ హీరో శివ కందుకూరి న‌టిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'మ‌ను చరిత్ర`. మేఘా ఆకాష్‌, ప్రియ వ‌డ్ల‌మాని హీరోయిన్ల‌గా న‌టిస్తోన్న ఈ  చిత్రంతో భ‌ర‌త్ పెద‌గాని ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

Manu Charitra: 'మ‌ను చరిత్ర` నుంచి మరో అందమైన మెలోడీ.. యువతను ఆకట్టుకుంటున్న సాంగ్
Manu Charitra
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Nov 08, 2021 | 7:02 AM

Manu Charitra: యంగ్ హీరో శివ కందుకూరి న‌టిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘మ‌ను చరిత్ర`. మేఘా ఆకాష్‌, ప్రియ వ‌డ్ల‌మాని హీరోయిన్ల‌గా న‌టిస్తోన్న ఈ  చిత్రంతో భ‌ర‌త్ పెద‌గాని ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రొద్దుటూరు టాకీస్ బ్యాన‌ర్‌పై న‌రాల శ్రీ‌నివాస‌రెడ్డి నిర్మిస్తున్నారు. వ‌రంగ‌ల్ నేప‌థ్యంలో ఇంటెన్స్ ల‌వ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన పోస్ట‌ర్స్‌, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి హ‌మేషా..హ‌మేషా లిరిక‌ల్ వీడియోసాంగ్ ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

క‌న‌బ‌డక‌నే తెగ తిరుగుతు న‌ను వెతికిన తుమ్ సే మేరా.. అంటూ సాగే ఈ పాట‌కు కృష్ణ‌కాంత్ (కె.కె) సాహిత్యం అందించారు. ర‌మ్య బెహ్రా అందంగా ఆల‌పించారు. గోపీ సుంద‌ర్ ఫ్రెష్ ట్యూన్స్ శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ నమ్మకంగా చెప్తున్నారు. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటూ  ట్రెండ్ అవుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Manisha Koirala: ప్రయాణం కష్టమైనదని నాకు తెలుసు.. అయినా కొనసాగించాలి.. మనీషా కోయిరాలా..

Lasya Manjunath: స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్న ‘లాస్య మంజునాథ్’ కొడుకు.. ఫ్యామిలీ ఫొటోస్..

Nivetha Pethuraj: న్యూ ఫోటో స్టిల్స్ తో కుర్రోళ్ళ మతి పోగొడుతున్న నివేత పేతురాజ్ ఫొటోస్..