Katrina Kaif: క్షమించండి అంటూ అక్షయ్‌ కాళ్లు పట్టుకున్న కత్రినా కైఫ్‌.. అసలు విషయమేంటంటే..

బాలీవుడ్‌ సినిమాలకు సంబంధించి సక్సెస్‌ఫుల్‌ జోడీల్లో అక్షయ్‌ కుమార్‌- కత్రినా కైఫ్‌ జంట కూడా ఒకటి. 'హమ్‌ కో దివానా కర్‌గయే', 'వెల్కమ్‌' సిరీస్‌, 'తీస్‌మార్‌ఖాన్‌,

Katrina Kaif: క్షమించండి అంటూ అక్షయ్‌ కాళ్లు పట్టుకున్న కత్రినా కైఫ్‌.. అసలు విషయమేంటంటే..
Follow us
Basha Shek

|

Updated on: Nov 08, 2021 | 7:36 AM

బాలీవుడ్‌ సినిమాలకు సంబంధించి సక్సెస్‌ఫుల్‌ జోడీల్లో అక్షయ్‌ కుమార్‌- కత్రినా కైఫ్‌ జంట కూడా ఒకటి. ‘హమ్‌ కో దివానా కర్‌గయే’, ‘వెల్కమ్‌’ సిరీస్‌, ‘తీస్‌మార్‌ఖాన్‌,’ ‘సింగ్ ఈజ్‌ కింగ్‌’, ‘నమస్తే లండన్‌’ తదితర సినిమాల్లో వీరి కెమిస్ట్రీ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ జోడీ నటించిన తాజాగా చిత్రం ‘సూర్యవంశీ’. రోహిత్‌ శెట్టి దర్శకుడు. ఎప్పటి నుంచో వాయిదాలు పడుతూ వస్తోన్న ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కత్రినా – అక్షయ్‌ జోడీ మరో హిట్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా కత్రినా- అక్షయ్‌ కుమార్‌లు కపిల్‌ శర్మ కామెడీ షోకు హాజరయ్యారు. తాజాగాఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది.

కత్రినా  నిజంగానే  నన్ను  చెంపదెబ్బ కొట్టింది.. ‘తీస్‌మార్‌ఖాన్‌’ జోడీ సరదా స్టెప్పులు, కామెడీ పంచులు, సరదా సంభాషణలతో సాగిన ఈ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే షోలో భాగంగా అక్షయ్‌ ‘మీరందరూ గమనించారా…కత్రినా షోలో అందరికీ హాయ్‌ చెప్పింది. నమస్తే అంటూ పలకరించింది. కానీ నన్ను మాత్రం అడగలేదు..నాలాంటి సీనియర్ల పట్ల ఆమెకున్న గౌరవం అలాంటిది’ అంటూ సరదాగా కత్రినాను ఆటపట్టించారు. దీంతో కత్రినా వెంటనే అక్షయ్‌ దగ్గరకు వెళ్లి ‘అదేం లేదు’ అంటూ అక్షయ్‌ కాళ్లను పట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక షోలో భాగంగా కపిల్‌ అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చారు కత్రినా- అక్షయ్‌. ఈ సందర్భంగా సినిమాలో ఏయే సీన్లకు ఎక్కువ రీటేక్‌లు తీసుకున్నారని కపిల్‌ కత్రినాను అడగ్గా ‘ అక్షయ్‌తో నా ట్యూనింగ్‌ చాలా బాగుంటుంది. ఏ సీన్లకైనా మేం ఎక్కువ రీటేక్‌లు తీసుకోం. రొమాంటిక్‌ సీన్లకు ఎక్కువ రీటేక్‌లు అవసరం లేదు. చెంపదెబ్బ సీన్‌ కూడా సింగిల్‌ టేక్‌లో చేశాం’ అని చెప్పింది. దీనికి స్పందించిన అక్షయ్‌.. ‘కత్రినా నిజంగానే నన్ను గట్టిగా చెంపదెబ్బ కొట్టింది’ అంటూ నవ్వులు పూయించాడు.

Also Read:

Sai Dharam Tej: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలోనే షూటింగ్‌కు హాజరుకానున్న సాయి ధరమ్ తేజ్..?

Keerthy Suresh: వరుస సినిమాలతో దూకుపోతున్న అందాల భామ.. కీర్తి కిట్టీలో మరో భారీ సినిమా..!

Manu Charitra: ‘మ‌ను చరిత్ర` నుంచి మరో అందమైన మెలోడీ.. యువతను ఆకట్టుకుంటున్న సాంగ్